ఫేస్‌బుక్, ట్విట్టర్ తప్ప మిగతా ఏ సోషల్ మీడియా యాప్‌లోనూ అకౌంట్ లేని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కొత్తగా ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టి రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. మంగళవారం ఆయన ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే మిలియన్స్ లో ఫాలోవర్స్ పెరిగారు. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ప్రస్తుతానికి ఆయన ఇన్‌స్టా ఫాలోవర్స్ 1.6 మిలియన్స్ మంది. సాధారణంగా సోషల్ మీడియాలో మిలియన్స్ లో ఫాలోవర్స్ రావడానికి కాస్త సమయం పడుతుంది. అలాంటిది పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాలోకి అడుగుపెట్టగానే కొద్ది సేపటికే అకౌంట్ వెరిఫై అయిపోయింది. కొన్ని గంటల్లో వన్ మిలియన్ దాటిపోయారు. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. ఇది సోషల్ మీడియాలో ఒక సరికొత్త రికార్డు అని చెప్పొచ్చు. ఎలాంటి ప్రమోషన్ లేకుండా, ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా వేల సంఖ్యలో ఫాలోవర్స్ పెరుగుతున్నారు.
దీంతో ప్రపంచంలో అత్యంత వేగవంతంగా ఇన్‌స్టా ఫాలోవర్స్ ని దక్కించుకున్న టాప్ 10 సెలబ్రిటీస్‌లో ఒకడిగా నిలిచాడు పవన్ కళ్యాణ్. ఫాస్టెస్ట్ 1 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించిన సెలబ్రిటీస్ లిస్ట్ లో.. కిమ్ టాయ్( Kim Toy ) కి కేవలం 43 నిమిషాల్లోనే 1 మిలియన్ ఫాలోవర్స్ సంపాదించారు. ఆ తర్వాత ఏంజలీనా జోలీ కి 59 నిమిషాల్లో 1 మిలియన్ ఫాలోవర్స్ రాగా, తమిళ స్టార్ హీరో జోసెఫ్ విజయ్(Vijay joseph ) కి 99 నిమిషాల్లో 1 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. రూపెర్ట్ గ్రింట్(Rupert Grint ) కి నాలుగు గంటల ఒక్క నిమిషం, డేవిడ్ అట్టెన్ బారో(David Attenborough ) కి నాలుగు గంటల 44 నిమిషాలు , జెన్నిఫర్ అనిస్టన్( Jennifer Aniston) కి 5 గంటల 16 నిమిషాలు, ప్రిన్స్ హ్యారీ(Price Harry) కి 5 గంటల 45 నిమిషాలు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి 6 గంటల 25 నిమిషాల సమయం పట్టింది.
ఇలా ప్రపంచం లోనే వివిధ రంగాలకు చెందిన దిగ్గజాల మధ్యలో చేరిన ఏకైక తెలుగు హీరో గా పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించాడు.అయితే వీళ్ళందరూ కూడా ఎదో ఒక ఫోటో కానీ, వీడియో కానీ అప్లోడ్ చేస్తూ ఇంస్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఒక్క పోస్ట్ కూడా చెయ్యకుండా 1 మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ని సంపాదించడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.