పవన్ కళ్యాణ్ ఓజి రిలీజ్ డేట్ వచ్చేసింది..

Byline :  Babu Rao
Update: 2024-01-30 10:50 GMT

కొన్నాళ్లుగా సినిమాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ పేరు పెద్దగా వినిపించడం లేదు. వినిపించినా.. అవన్నీ మాగ్జిమం నెగెటివ్ గానే కనిపించాయి. ఆయన పాలిటిక్స్ లో ఉండటం వల్ల సినిమాలకు టైమ్ కేటాయించలేకపోయాడు. కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ లో కూడా పార్టిసిపేట్ చేయలేకపోయాడు. దీనివల్ల రిలీజ్ డేట్స్ ఆర్డర్స్ మారాయి. ఒకట్రెండు సినిమాలు ఆగిపోయినట్టే అన్న వార్తలూ వచ్చాయి. ఇవి నిజమే అని దాదాపు కన్ఫార్మ్ అంటున్నారు.ఇక నెక్ట్స్ ఎన్నికల్లో బిజీగా ఉండబోతున్నాడు. దీంతో మరి పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు వస్తుంది అని ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్ కు ఫైనల్ గా ఓ గూడ్ న్యూస్ చెప్పారు..

పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఎలా ఉన్నా.. సినిమాల పరంగా అతని క్రేజ్ తగ్గలేదు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయన్ని అభిమానించేవాళ్లు లక్షల్లో ఉన్నారు. తన తరం హీరోల్లా ప్యాన్ ఇండియన్ మార్కెట్ వైపు వెళ్లలేదు. కానీ తెలుగులో అతని రేంజ్ మాత్రం ఆ హీరోలకు లేదు అనేది నిజం. రీసెంట్ గా వచ్చిన భీమ్లా నాయక్ ఓ మోస్తరు విజయం సాధించింది. బ్రో మాత్రం ఆశించినంతగా ఆకట్టుకోలేదు. అయినా సినిమాలేం నష్టపోవు. అదీ పవన్ కళ్యాణ్ ఛరిష్మా. ఇక చాలాకాలం క్రితమే మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశాడు పవన్. వీటిలో గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ తో స్టార్ట్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉంది. దీనికంటే ముందే క్రిష్ డైరెక్షన్ లో రాబిన్ హుడ్ తరహాలో సాగే పీరియాడిక్ డ్రామాగా హరిహర వీరమల్లు స్టార్ట్ అయింది. కొన్నాళ్లు షూటింగ్ కూడా అయింది. బట్ ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇక చివరగా స్టార్ట్ అయింది.. ఓ.జి మూవీ. సాహో ఫేమ్ సుజిత్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే గ్యాంగ్ స్టర్ స్టోరీ ఇది. అందుకే ఫ్యాన్స్ కూడా ఎగ్జైట్ అయ్యారు. బట్ వీరి ఎగ్జైట్మెంట్ కు కూడా ఫుల్ స్టాప్ పడింది. 50శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ కూడా ఆగింది. దీంతో మళ్లీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. వారి కోసమే ఈ అప్డేట్. ఏపిలో ఎన్నికల హడావిడీ ఏప్రిల్ మే వరకూ పూర్తవుతుంది. ఆ తర్వాత పూర్తిగా ఓజి షూటింగ్ కే టైమ్ ఇవ్వబోతున్నాడు పవన్. అందుకే మేకర్స్ ధైర్యంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకున్నారు. ఓజి మూవీని ఈ యేడాది సెప్టెంబర్ 27న విడుదల చేయబోతున్నట్టు అఫీషియల్ గానే ప్రకటించారు. ఈ డేట్ లాంగ్ వీకెండ్ గా వస్తుంది. ఆ తర్వాత దసరా హాలిడేస్ కూడా యాడ్ అవుతాయి. అందుకే పర్ఫెక్ట్ డేట్ సెట్ అయిందనుకుంటున్నారు. మరి ఈ ఛాన్స్ ను ఉపయోగించుకుని ఓజి ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇమ్రాన్ హష్మీ విలన్ గా , అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రేయారెడ్డి ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. 

Tags:    

Similar News