పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ వైపు సినిమాలతో మరో వైపు రాజకీయాలతో గడుపుతున్న పవన్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పవన్ సినిమా వస్తే థియేటర్స్ వద్ద పండగే. పొలిటికల్ మీటింగ్ పెట్టినా లక్షల్లో వస్తారు జనాలు. సాధారణంగా సెలబ్రిటీలు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇస్తే అభిమానులు సంతోషిస్తారు, ఫాలోయింగ్ మరింత ఎక్కువవుతుంది.
పవన్ కళ్యాణ్ ఇప్పటికే ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉన్నారు. అయితే పవన్ తన ట్విట్టర్ అకౌంట్ లో సినిమాల గురించి మాత్రం పోస్ట్ చేయరు. కేవలం పాలిటిక్స్, జనసేన పోస్టులు మాత్రమే పోస్ట్ చేస్తారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా పవన్ ఇన్‌స్టాగ్రామ్ లోకి వస్తారు అనే వార్తలు వచ్చాయి. నేడు ఉదయం పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ లో తన అధికారిక అకౌంట్ ని క్రియేట్ చేసుకున్నారు. ఇలా అకౌంట్ ఓపెన్ చేశాడో లేదో లక్షల్లో ఫాలోవర్స్ వచ్చి చేరుతున్నారు. అభిమానులు, కార్యకర్తలకు నిత్యం టచ్లో ఉండాలని భావిస్తున్న నేపథ్యంలో ఇన్‌స్టాలోకి పవన్ అడుగుపెట్టాడట. పవన్ కళ్యాణ్ టీం ఈ అకౌంట్ ని మేనేజ్ చేస్తుంది.
అయితే ఇన్‌స్టాగ్రామ్ లో కూడా పవన్ జనసేనకు, పాలిటిక్స్ కి సంబంధించిన పోస్టులే చేస్తారని, సినిమాకు సంబంధించినవి మాత్రం చేయకపోవచ్చని సమాచారం. ఈ విషయంలో మాత్రం అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ లోకి వచ్చాడని తెలియగానే అభిమానులు, నెటిజన్లు, సెలబ్రిటీలు ఆయన్ని ఫాలో అవుతున్నారు. నిమిషం నిమిషంకి పవన్ అకౌంట్ కి ఫాలోవర్స్ భారీగా పెరుగుతున్నారు. ఇక పవన్ సినిమాలో విషయానికొస్తే.. ఆయన తాజాగా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం.. బ్రో మరో 4 వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే రిలీజైన టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీనితో పాటుగా సుజీత్‌తో ఓజీ, హరీష్ శంకర్‌తో ఉస్తాద్ భగత్‌సింగ్ చేస్తున్నాడు. ఇక క్రిష్‌తో పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు చేస్తున్నాడు.
ఓపెన్ ఇన్‌స్టాగ్రామ్..
https://www.instagram.com/pawankalyan/?hl=en