పవన్ కల్యాణ్ ‘ఓజీ’ సినిమాలో విలన్‍గా బాలీవుడ్ హీరో..

Update: 2023-06-15 15:09 GMT

వరుస సినిమాలతో పవన్ కల్యాణ్ బిజీబిజీగా ఉన్నారు. బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో పవన్ నటిస్తున్న మరో నూతన చిత్రం ఓజీ. ఈ సినిమాలో గ్యాంగస్టర్ పాత్రలో పవర్ స్టార్ కనిపించనున్నారు. సుజీత్ దర్శకత్వంలో..డివీవీఎంటర్‌టైన్‍మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్యాన్ ఇండియా మూవీగా ఓజీ రూపొందుతోంది. దీంతో నటీనటలు ఎంపిక విషయంలో చిత్ర బృందం జాగ్రత్త వహిస్తోంది. ఇప్పటికే తమిళ నటుడు అర్జున్ దాస్‍ ఈ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రియాంక మోహన్ హీరోయిన్‍ పాత్ర పోషిస్తోంది. తాజాగా సినిమా నుంచి మరో అదరిపోయే అప్డేట్ వచ్చింది. ‘ఓజీ’ సినిమాలో విలన్‍గా ఓ బాలీవుడ్ సీనియర్ హీరో నటించనున్నాడు.

పవన్ కల్యాణ్‌ను ఇమ్రాన్ హష్మి ఢీ కొడతాడని చిత్రం బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ ట్వీట్ చేసింది. “మన దగ్గర ఓజీ ఉన్నప్పుడు.. శక్తివంతమైన మరో వ్యక్తి కూడా ఉండాలి. విలన్‍ ఇమ్రాన్ హష్మిని అందరికీ పరిచయం చేస్తున్నాం” అని డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ ట్వీట్ చేసింది. రొమాన్స్ కింగ్‌గా పేరు ఉన్న ఇమ్రాన్ హష్మి..పవన్ కల్యాణ్ సినిమాలో విలన్‎గా కనిపించడం ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News