తెలంగాణ వాళ్లు జగన్‌ను తరిమేశారు.. అందుకే.. పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు

Update: 2023-08-11 14:02 GMT

తెలంగాణ నుంచి సీఎం జగన్‌ను తరిమేస్తే ఉత్తరాంధ్రపై పడ్డారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. శుక్రవారం విశాఖలోని రుషికొండను పవన్ పరిశీలించారు. రుషికొండ వద్దకు నడుచుకుంటూ వెళ్లడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డు వద్ద నుంచే పరిశీలించి రుషికొండను తవ్వడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

తెలంగాణను దోచింది చాలక ఉత్తరాంధ్ర మీద కన్నేశారన్నారు. ప్రజలు శాంతియుతంగా ఉంటారని చెప్పి, ఉత్తరాంధ్రను దోపిడీ చేయడం తగదన్నారు. వైసీపీ అక్రమాలను మీడియా వెలుగులోకి తేవాలని పవన్ కోరారు. తానొక్కడినే చేయడం కాదని, అందరూ ప్రజలకు చెప్పాలన్నారు. మూడు రాజధానులంటూ ఏపీకి ఒక్క రాజధాని లేకుండా చేశారని జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రే చట్టాలను ఉల్లంఘిస్తే ఎలా అని ప్రశ్నించారు. విపక్షాలు, ఇతరులు ఎవరైనా శాంతియుతంగా చిన్న నిరసన తెలిపినా అరెస్టు చేస్తారని, కానీ జగన్ ప్రభుత్వం మాత్రం కొండను తవ్వినా ఏం కాదా? అన్నారు. రాష్ట్రంలోనే ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను దోచేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి ఒక ఇల్లు సరిపోదా? ఇంకా ఎన్ని ఇళ్లు కావాలన్నారు. కిర్లంపూడి లేఔట్ తాకట్టు పెట్టి, ఇక్కడ అవసరమా? అన్నారు. రిషికొండలో నిర్మాణాలకు గ్రీన్ ట్రైబ్యునల్ అనుమతి ఉందా? లేదా చెప్పాలని డిమాండ్ చేశారు.

పవన్ రుషికొండ పర్యటనలో అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించారు. పవన్ వెంట ఎనిమిది వాహనాలు మాత్రమే వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో రుషికొండ జోడిగుళ్ళపాలం దగ్గర పోలీసులతో జనసేన నాయకులు వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి


Tags:    

Similar News