పాపం పాయల్..ఆఫర్ల కోసం ఆ పని

Byline :  Shabarish
Update: 2024-03-19 10:45 GMT

సినిమా ఆఫర్ల కోసం హీరోయిన్లు నానాతంటాలు పడుతుంటారు. కాస్తో కూస్తో ఫేమస్ వస్తే చాలు ఇక దానిని నిలబెట్టుకునేందుకు సెలబ్రిటీలు పడరానిపాట్లు పడుతుంటారు. RX 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ సాధించిన ఈ బ్యూటీ బోల్డ్‌గా నటించి అభిమానులను సొంతం చేసుకుంది. గ్లామర్ చూపించడమే కాదు లిప్ లాక్‌లతో రెచ్చిపోయింది. అమ్మడు అందానికి యూత్ అంతా ఎగబడ్డారు. ఆ మూవీ తర్వాత పాయల్ రేంజ్ మారిపోయింది. కట్ చేస్తే..సరైన అవకాశాలు లేక తల్లడిల్లిపోయింది.

Full View

ఆ తర్వాత RX 100 దర్శకుడుతోనే మంగళవారం సినిమా చేసి మరో హిట్ సాధించింది. అయితే మళ్లీ ఆఫర్లు రావాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. అందుకే ఈ హాట్ బ్యూటీ తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తోంది. తాజాగా పాయల్ ముగ్గురు అమ్మాయిలతో కలిసి బాత్‌టబ్‌లో మందు గ్లాస్ పట్టుకుని కనిపించింది. బ్లాక్ టాప్, రెడ్ స్కర్ట్‌లో మందు గ్లాస్‌తో పాయల్ రెచ్చిపోయింది. ఆ ఫోటోలను కాస్తా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. ఆఫర్ల కోసం ఇవేం పనులు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి బాత్ టబ్ ఫోటోలతో పాయల్ మరోసారి నెట్టింట సందడి చేస్తోంది.


Tags:    

Similar News