Nagarjuna Sister: మోసం చేసిందంటూ.. అక్కినేని నాగార్జున చెల్లెలిపై కేసు

By :  Bharath
Update: 2023-09-18 14:33 GMT

నాగసుశీల అంటే తెలిసినవాళ్లు చాలా తక్కువ. హీరో నాగార్జున చెల్లెలిగా, సుశాంత్ తల్లిగా అందరికీ సుపరిచితం. కొడుకు సుశాంత్ ను హీరోగా పెట్టి పలు సినిమాలు నిర్మించింది. కరెంట్, అడ్డా, ఆటాడుకుందాం రా.. సినిమాల ద్వారా సుశాంత్ ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అంతా బాగేనే ఉంది అనుకునే టైంలో.. తాజాగా సుశీలపై పోలీస్ కేసు విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. గత కొంత కాలంగా చింతలపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తితో కలిసి సినిమాలు నిర్మించింది సుశీల. అంతేకాకుండా వీళ్లిద్దరు కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా నడిపించారు. ఈ క్రమంలో తనకు తెలియకుండా శ్రీనివాస్ భూముల్ని అమ్ముకుని డబ్బుల్ని దుర్వినియోగం చేస్తున్నాడని సుశీల ఆరోపించింది. అంతేకాకుండా 2019లో అతనిపై పోలీస్ కేసు పెట్టింది. ఇక అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో శ్రీనివాస్, సుశీలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. సుశీల 12 మందిని వెంటపెట్టుకొచ్చి తనపై దాడి చేసిందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం ఎక్కడికి వెళ్తుందనేది హాట్ టాపిక్ అయింది.

Tags:    

Similar News