Actor Ranjith : అధికార దాహంతోనే రాజకీయాల్లోకి హీరో విజయ్ ..నటుడు రంజిత్ సంచలన వ్యాఖ్యలు
తమిళ స్టార్ హీరో విజయ్ అధికార దాహంతోనే రాజకీయాల్లోకి వచ్చారని తమిళ నటుడు రంజిత్ ఆరొపించారు. విజయ్ లాంటి వాళ్లు వెయ్యి మంది వచ్చినా తమిళనాడు రాజకీయాలను మార్చలేరు అని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో పార్టీలు మారేవాళ్లు ఎక్కువవుతారని ఓటుకు డబ్బు పంచే వాళ్లను ప్రజలు ఎన్నుకోవద్దు తమ హక్కు వినియోగించుకోవాలి అని ఆయన అన్నారు.
ఓటుకు రూ. 10 వేల నుంచి రూ. 12 వేల వరకు డబ్బులు పంచే వారిని ప్రజలు గెలిపించకూడదని రంజిత్ అన్నారు. రాష్ట్రంలో సమూల మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజలు ఎన్నికలను బహిష్కరించకుండా తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో స్వలాభం కోసం కొందరు పార్టీలు మారుతుంటారని.. దీనికి విజయధరణి మంచి ఉదాహరణ అని చెప్పారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడిన ప్రతిసారి మద్యం అమ్మకాలను తగ్గిస్తామని చెపుతుంటారని.. కానీ, విక్రయాలను పెంచుకుంటూనే పోతున్నారని మండిపడ్డారు. సినీ నటి త్రిష వ్యవహారంలో ఎవరినీ తప్పుపట్టలేమని చెప్పారు.