పాప్‌ సింగర్‌ బ్రిట్నీ స్పియర్స్‌‎కి షాక్..పోలీసులు ఇంటికి వచ్చి..

By :  Aruna
Update: 2023-09-29 14:53 GMT

సెలబ్రిటీలు చేసే కొన్ని వీడియోలు కొన్నిసార్లు వారిని చిక్కుల్లో పడేస్తుంటుంది. తాజాగా అలాంటి చిక్కుల్లోనే పాడిపోయింది పాపం పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ .ఆమె రీసెంట్‎గా సరదాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో ఏకంగా ఆమె ఇంటికి పోలీసులు వచ్చేలా చేసింది. ఆ తర్వాత పోలీసులకు క్లారిటీ ఇవ్వడంతో వివాదం ముగిసినట్లైంది.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. కొన్ని రోజుల క్రితం బ్రిట్నీ స్పియర్స్‌ తన కిచెన్‎లో కత్తులతో డ్యాన్స్ చేసింది. ఆ వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ ఫోటోలతో పాటు ఓ మేసేజ్ పెట్టింది " నేను కిచెన్‎లో కత్తులతో ఆడుకుంటున్నాను. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు..ఇవి నిజమైన కత్తులు కాదు" అంటూ కామెంట్‌ చేసింది. అయితే ఒక వీడియోలో ఆమె డ్యాన్స్‌ చేసిన అనంతరం ఆమె థైస్, హ్యాండ్స్‎పై కట్‌ చేసుకున్నట్లు చూపించారు. దీంతో ఆమె ఫ్యాన్స్ బ్రిట్నీ డేంజర్‎లో ఉందని భావించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెంటనే అలర్ట్ అయిన వెంచురా కౌంటీ పోలీసులు బ్రిట్నీ ఇంటికి వెళ్లారు. ఆమె మెంటల్లీ బాగానే ఉందని ఉందని తెలుసుకున్న పోలీసులకు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు స్థానిక న్యూస్ ఛానెల్స్ తెలిపాయి. ఈ విషయాన్ని వివరిస్తూ బ్రిట్నీ మరో వీడియో షేర్ చేసింది. " నేను నా ఫేవరేట్ సింగర్‌ షకీరాను ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశాను. మీరు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. దయచేసి మీరు పోలీసులకు ఫోన్ చేయొద్దు" అని తన ఫ్యాన్స్‏ను రిక్వెస్ట్ చేసింది. ఈ పోస్ట్‎తో బ్రిట్నీ సేఫ్‏గానే ఉందని ఊపిరి పీల్చుకున్నారు.


Tags:    

Similar News