OTTలోకి వచ్చేసిన ఆదిపురుష్.. సబ్స్క్రిప్షన్ ఉన్నా పైసలు కట్టాల్సిందే..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. రామాయణ ఇతివృత్తం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో సీతగా కృతి సనన్ నటించింది. ఓం రౌత్ డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న ఈ సినిమా జూన్ 16న రిలీజైంది. ప్రీ బుకింగ్స్ కారణంగా మొదటి వారం బాగానే ఆడినా లాంగ్ రన్లో మాత్రం అనుకున్న రేంజ్లో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. వివాదాల కారణంగా సినిమాను కొన్నిచోట్ల బాయ్ కాట్ చేశారు. దాదాపు రూ.700 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
తాజాగా ఆదిపురుష్ సినిమా ఎలాంటి చడీచప్పుడూ లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. అర్థరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్లో మూవీ స్ట్రీమ్ అవుతోంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రసారం అవుతోంది. మరోవైపు ఆదిపురుష్ హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్లోకి అందుబాటులోకి వచ్చింది. ఆదిపురుష్ ఓటీటీ హక్కులను ప్రైమ్ వీడియో రూ.150-200 కోట్లు పెట్టి మరీ సొంతం చేసుకున్నట్లు సమాచారం. భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్, వంశీ- ప్రమోద్ సంయుక్తంగా టి-సిరీస్, రెట్రోఫిల్స్ బ్యానర్లపై ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. సన్నీ సింగ్, దేవదత్తా నాగే, వత్సల్ షేత్, సోనాల్ చౌహాన్, తృప్తి తోరడ్మల్ కీలక పాత్రలు పోషించారు.
ప్రస్తుతం ఆదిపురుష్ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో చూడాలంటే సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అదనంగా రూ. 279 రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా ఫ్రీ స్ట్రీమింగ్ ఉండే అవకాశం ఉంది. నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాను రెంట్ బేసిస్పై అందుబాటులోకి తేవడంపై నెటిజన్లు సటైర్లు వేస్తున్నారు.