‘సరే.. ముఖం ప్రభాస్దే. బాడీ ఎవర్దో చెప్తే బాగుంటది’.. ఫస్ట్ లుక్పై ట్రోలింగ్స్
ప్రాజెక్ట్ కె సినిమా కోసం ప్రపంచం ఎదురుచూస్తుంది. ఇప్పటి వరకు ఆ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్, పోస్టర్స్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రముఖ నటులు నటిస్తుండటంతో.. హైప్ మరింత పెరిగింది. అంతేకాకుండా టైమ్ ట్రావెట్ అంటూ లీక్ అయిన స్టోరీ లైన్.. ఆదిపురుష్ సినిమా ఫెయిల్ కావడంతో ప్రాజెక్ట్ కె పైనే హోప్స్ పెట్టుకున్నారంతా. మరోవైపు అమెరికాలో ఇప్పటికే ప్రాజెక్ట్ కె సందడి మొదలయింది. ప్రతిష్ఠాత్మకమైన శాన్ డియాంగో కామిక్ కాన్ ఈవెంట్ వేదికపై ఈ చిత్రాన్ని ఆవిష్కరించనున్నారు.
ఈ వేదికపై ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించనున్న తొలి భారతీయ సినిమాగా ప్రాజెక్ట్ కె చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో బుధవారం (జులై 19) ప్రాజెక్ట్ కె నుంచి ప్రభాస్ ఫస్ట్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర బృందం. పోస్టర్ చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రభాస్ ఏంటి ఇలా ఉన్నాడు? అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఐరన్ సూట్ లో యాక్షన్ సీన్ ను తలపిస్తున్న ఆ పోస్టర్ చేసి.. తల ప్రభాస్ దే.. కానీ, బాడీ కూడా ఎవరిదో చెప్తే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె పని అయిపోయింది. సలాత్ తో చూసుకుందాం అంటూ తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొందరు ఇది ఒరిజినల్ పోస్టర్ కాదని, ఫ్యాన్ మేడ్ పోస్టర్ అంటూ తమ అభిప్రాయాన్ని షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ పోస్టర్ ను చిత్ర బృందమే అధికారిక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో షేర్ చేసింది.