ఇండియాస్ టాప్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమాకు సంబంధించి మొదలైనప్పుడు ఉన్న ఊపు ఇప్పుడు కనిపించడం లేదు. ముఖ్యంగా రిలీజ్ డేట్ దగ్గరకు వస్తోన్నా దానికి సంబంధించిన ఊసులేవీ వినిపించడం లేదు. ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోణ్, దిశా పటానీ వంటి టాప్ స్టార్స్ ఉన్నారు. కమల్ హాసన్ ఓ గెస్ట్ రోల్ చేస్తున్నాడు. దీనికి తోడు ఇది ఆరు వేల యేళ్ల పాటు సాగే కథ అని ఊరించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. డిఫరెంట్ యూనివర్స్ ల్లో సాగే కథ అని కూడా చెప్పాడు. కల్కి అనేది హిందూ మైథాలజీస్ నుంచి తీసుకున్న కంటెంట్ అని కూడా అన్నాడు.
సో.. బిగ్ స్క్రీన్ పై ఓ భారీ కథ చూస్తాం అనుకున్న ఆడియన్స్ ను అదే పనిగా ఇబ్బంది పెడుతున్నట్టు కనిపిస్తోంది. నిజానికి ఈ మూవీని గత సంక్రాంతికే విడుదల చేస్తారు అన్నారు. బట్ సమ్మర్ కు పోస్ట్ పోన్ అయింది. మే 9న అనే డేట్ కూడా చెప్పారు. బట్ అందుకు తగ్గట్టుగా హడావిడీ ఏం లేదు. చాలా క్యాజువల్ గా ఉందీ టీమ్. నాగ్ అశ్విన్ పర్ఫెక్షన్ ఉన్న దర్శకుడు. అందులో డౌట్ లేదు. కానీ ఇలా రిలీజ్ కు ముందు కామ్ గా ఉంటే ఖచ్చితంగా మైనస్ అవుతుంది. ఎప్పుడో వచ్చే సినిమాలకు సంబంధించే ఓ రకమైన హంగామా కనిపిస్తుంది.
అలాంటి ఇంత పెద్ద స్పాన్ ఉన్న మూవీకి అదేం కనిపించడం లేదు. అంటే కల్కి అసలు మే 9న విడుదలవుతుందా లేదా అనే డౌట్స్ విపరీతంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ పోస్ట్ పోన్ అయితే మాత్రం ఆ తర్వాత వచ్చే పెద్ద సినిమాల డేట్స్ అన్నీ షేక్ అవుతాయి. అది ఎలా ఉన్నా.. కల్కి రిలీజ్ డేట్ పై ఇప్పటికైనా ఓ క్లారిటీ ఇస్తే బావుటుందనేది ప్రభాస్ అభిమానుల నుంచి వినిపిస్తోన్న మాట. మరి అప్డేట్ ఇస్తారా లేదా అనేది చూద్దాం.