నాగ్ అశ్విన్ ప్రభాస్ తో తీస్తున్న మూవీ కల్కి. ఈమధ్యనే దీని టీజర్ రిలీజ్ అయింది. దీనికి మంచి అప్రిసియేషన్ కూడా వచ్చింది. కల్కి 2898ఏడీ షూటింగ్ ను త్వరత్వరగా ముగిస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఈ డేట్ మారింది. కొత్త న్యూస్ ప్రకారం మే 9న విడుదల చేయాలని అనుకుంటున్నారుట నాగ్ అశ్విన్.
సంక్రాంతికి సినిమా రాదని మూవీ టీమ్ అఫిషీయల్ గా అయితే ప్రకటించలేదు కానీ... ఇంత భారీ సినిమాను రెడీ చేయడానికి టైమ్ సరిపోదని అంటున్నారు సినీ వర్గాలు. ఇప్పటికి షూటింగే పూర్తి కాలేదు. దాని తర్వాత విజువల్ ఎఫెక్ట్స్...అది కూడా అన్ని భాషల్లో చేయడం అంటే మాటలు కాదు..చాలా టైమ్ పడుతుంది. అందుకే కల్కి మూవీ సంక్రాంతికి పక్కా రిలీజ్ అవదని చెబుతున్నారు. మరోవైపు నాగ్ అశ్విన్ షూటింగ్ పూర్తయ్యాక విడుదల తేదీని చెబుతానని అంటున్నారు. కానీ ఎప్పుడు విడుదల చేయాలనే విషయం మాత్రం సీరియస్ గానే తీసుకున్నారుట.
కల్కి సినిమా రిలీజ్ మే 9 చేస్తే బావుంటుందనే టాక్ వినిపిస్తోంది. ఈ డేట్ వైజయంతి మూవీస్ కి, నాగ్ అశ్విన్ కి కూడా లక్కీ. వైజయంతీ మూవీస్ జగదేకవీరుడు-అతిలోక సుందరి, నాగ్ అశ్విన్ తీసిన మహానటి రెండూ ఇదే తేదీన విడుదల అయ్యాయి. రెండూ భారీ హిట్ లను తీసుకువచ్చాయి. మహానటితో నాగ్ అశ్విన్ ఓ రేంజ్ కు వెళ్ళిపోయాడు కూడా. అందుకే ఇప్పుడు కల్కి సినిమాకు కూడా ఇదే డేట్ ఫిక్స్ చేస్తారని టాక్. ఇది కాదంటే మాత్రం 2024 దసరా వరకూ మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు.