ప్రభాస్ సినిమా అంటార్రా బాబు..1000 కోట్లకు కల్కి ఓటీటీ రైట్స్
ప్రభాస్ సినిమా అంటే ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. పాన్ ఇండియా లెవల్లో ఇప్పటికే బాహుబలి, బాహుబలి2, సాహో, సలార్ సినిమాలు బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టాయి. ఇక ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవల్లో ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీగా కల్కి 2898ఏడీ రానుంది. ఈ మూవీని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందుతోంది. నిర్మాత అశ్వినీదత్ ఈ మూవీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హాలీవుడ్ తరహాలో కల్కి మూవీ తెరకెక్కుతోంది. అందుకే ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
అందుకే కల్కి మూవీ థియేట్రికల్, శాటిలైట్, ఓటీటీ రైట్స్‌కి భారీ డిమాండ్ కనిపిస్తోంది. తాజాగా కల్కి ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. సౌత్ ఇండియన్ రైట్స్ అన్నీ కలిపి రూ.200 కోట్లకు అమ్ముడు కాగా, హిందీ బెల్ట్ రైట్స్ దాదాపు రూ.175 కోట్లకు అమ్ముడైనట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో మొత్తం ఓటీటీ రైట్స్ రూ.375 కోట్లకు అమ్ముడైనట్లు వినిపిస్తోంది. ఓటీటీ రైట్సే ఈ రేంజ్‌లో ఉంటే ఇక థియేటర్స్ రైట్స్ ఇంకా డబుల్‌గా ఉంటుంది.
దాన్ని బట్టి చూస్తే ఈ మూవీ థియేట్రికల్, శాటిలైట్, ఓటీటీ రైట్స్‌తోనే 1000 కోట్ల మార్క్‌ను దాటేసేలా ఉంది. మే 9న ఈ మూవీ థియేటర్లలోకి రికార్డు బద్దలు కొట్టేందుకు వచ్చేస్తోంది. అయితే ఎలక్షన్స్ వల్ల ఈ మూవీ డేట్ మారే అవకాశం ఉందని అంటున్నారు. జూలై 10న బాహుబలి మూవీ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యింది. ఆ డేట్‌లోనే ఇప్పుడు కల్కిని రిలీజ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారట. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.