ప్రభాస్ ఫ్యాన్స్కు భారీ షాక్.. ‘ప్రాజెక్ట్ కె’ ఆ వార్తల్లో నిజం ఉందా..?

Update: 2023-06-13 11:28 GMT

ప్రొడ్యూసర్ సీ. అశ్వినీదత్ గతంలో.. ఇప్పటివరకు ప్రభాస్ పాన్ ఇండియా హీరో.. ప్రాజెక్ట్ కె తర్వాత హాలీవుడ్ హీరో అయినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ.. మాస్ ఎలివేషన్స్ ఇచ్చాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో.. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది ఈ సినిమా. దేశంలోనే అత్యధిక ఖర్చుతో రూపొందుతున్న ఈ సినిమా.. షూటింగ్ శరవేగంగా పూర్తవుతోంది. అయితే.. మూవీ మేకర్స్ ఈ సినిమాను ఇంటర్నేషనల్ లోవల్ లో తెరకెక్కిస్తున్నట్లు ముందు నుంచే చెప్తున్నారు. దానికి తగ్గట్లే సినిమాకు కార్ల వంటి కావాల్సిన వస్తువులు తయారుచేసుకున్నారు. రీఇన్వెంటింగ్ ది వీల్ అంటూ ఒక వీడియోను ఇటీవలే విడుదల చేసింది చిత్ర బృందం. సినిమాలో ప్రభాస్ ఆ వీల్ తోనే టైం ట్రావెల్ చేస్తాడని టాక్. ఆ వీడియోలో ఆ వీల్ తయారు చేయడానికి ఎంతలా కష్టపడ్డారో కనిపిస్తుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ కూడా బాగానే కష్టపడ్డాడని ఇన్ సైడ్ టాక్.

అయితే, ఈ సినిమాను పాన్ వరల్డ్ గా వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఆ న్యూస్ అనౌన్స్ చేస్తూ స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా సంక్రాంతికి రాకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. పీపుల్ మీడియా బ్యానర్ పై తెరకెక్కిన రవితేజ సినిమా ఈగల్ కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పీపుల్ మీడియా ప్రభాస్ కు ఎంత క్లోజ్ అనేది చెప్పక్కర్లేదు. ఎవ్వరూ ఊహించని విధంగా ఆదిపురుష్ హక్కులను కోట్లు పెట్టి కొనడమే కాకుండా.. మారుతి, ప్రభాస్ కాంబోలో వస్తున్న సినిమాను తెరకెక్కిస్తుంది. ప్రభాస్ నెక్స్ట్ సినిమా స్పిరిట్ కు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూడు సినిమాలతో ప్రభాస్ కు పీపుల్ మీడియా దగ్గరయింది. దీంతో కలెక్షన్స్ కోసం.. ప్రాజెక్ట్ కేను సంక్రాంతికి రిలీజ్ చేయరనే టాక్ వినిపిస్తోంది. ఈ వార్తల్లో నిజం ఎంతుందో ఇక్కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Tags:    

Similar News