విడుదలకు ముందే ‘సలార్’ అరుదైన రికార్డ్

Update: 2023-07-18 02:34 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్’ భారీ డిజాస్టర్ గా నిలవడంతో ప్రస్తుతం అభిమానుల ఆశలన్నీ సలార్ మీదనే ఉన్నాయి. కెజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్.. భారీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ విడుదలకు ఇంకా రెండు నెలలు మాత్రమే మిగిలి ఉండటంతో ప్రమోషన్స్ జోరు పెంచారు. తాజాగా ఈ సినిమాను అమెరికాలో 1979 లొకేషన్స్‌లో విడుదలకు ఒక రోజు ముందు స్పెషల్ ప్రీమియర్స్ వేస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది.

కారణమిదే..

‘సలార్’ మూవీని 1979 లొకేషన్స్‌లో విడుదల చేయడానికి ఓ కారణముందంటున్నారు అభిమానులు. ఈ సినిమాను 1979 బ్యాక్ డ్రాప్‌ నేపథ్యంలో తెరకెక్కించారు కాబట్టే 1979 లొకేషన్స్‌లో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. మరోవైపు ప్రభాస్ పుట్టిన సంవత్సరం 1979 కాబట్టి అన్ని చోట్ల ప్రీమియర్స్ వేస్తున్నారని అనుకుంటున్నారు. మొత్తంగా అమెరికాలో ఇన్ని లొకేషన్స్‌లలో ప్రీమియర్స్ వేయనున్న తొలి భారతీయ చిత్రంగా ‘సలార్’ రికార్డులకు ఎక్కనుంది. (Twitter/Photo)

రికార్డ్ వ్యూస్..

యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదలకానుంది. మలయాళీ సూపర్ స్టార్ పృథ్వీ రాజ్ సుకుమారన్ కీలకపాత్ర పోషిస్తున్న . హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌‌ను అన్ని భాషల్లో కలిపి ఒకటే రిలీజ్ చేయడంతో ఈ టీజర్‌కు అన్ని భాషల్లో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ మొదటి 24 గంటల్లో 83 మిలియన్ వ్యూస్ రాబట్టి సంచనలం రేపింది.


Tags:    

Similar News