ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా అక్కడే చూస్తాడట..

Update: 2023-06-14 14:13 GMT

రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. ప్రభాస్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో.. డైరెక్టర్ ఓంరౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. టికెట్ రేట్లు భారీగా పెంచినా.. జనాలు ఎగబడి కొంటున్నారు. దీంతో ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టిన కొద్ది క్షణాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్, చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వెళ్తారని అందురు భావించారు. అయితే ఇప్పటికే వచ్చిన హైప్ కారణంగా .. ఇక ప్రమోషన్స్ అవసరం లేదని భావించినట్లు తెలుస్తోంది. అయితే, ప్రభాస్ ఇప్పటికే యూఎస్ వెళ్లిపోయినట్లు సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇక అక్కడే ఆదిపురుష్ సినిమా చూడనున్నట్లు వార్తులు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News