తెలంగాణ అనగానే మొట్టమొదట గుర్తుకువచ్చే వ్యక్తి కాళోజీ. తెలంగాణ ఉద్యమానికి ప్రతినిధి ఈయన. హక్కుల కోసం పోరాటు చేసి, ఉద్యమాలు నడిపిన యోధుడు. ఇప్పుడు కాళోజీ మీద బయోపిక్ వస్తోంది. ప్రజాకవి కాళోజి అనే పేరుతో సినిమా రడీ అయింది.
సెప్టెంబర్ 9 కాళోజీ పుట్టినరోజు. ఇదే రోజు తెలంగాణ భాషా దినోత్సవం కూడా. అన్యాయాన్ని ధైర్యంగా ఎదురోడిన కలం వీరుడు కాళోజీని తెలంగాణ ప్రభుత్వం, ప్రజలకు ఎనలేని గౌరవం. ఈ ఉద్దేశంతోనే ప్రజాకవి అయిన కాళోజీ జీవితాన్ని వెండితెర మీద చూపించాలని డిసైడ్ అయ్యారు దర్శకుడు ప్రభాకర్ జైనీ. ఈయన ఇంతకు ముందు క్యాంపస్ అంపశయ్య, ప్రణయ వీధుల్లో, అమ్మా నీకు వందనలం లాంటి సినిమాలు తీశారు. స్వాతి వారపత్రిక వేమూరి బలరామ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.
కాళోజి పాత్రకు మూల విరాట్ అనే నటుడిని ఎంపిక చేశారు. ప్రజా కాళోజీగా మన ముందుకు వస్తున్న ఈ సినిమా చిత్రీకరణ కూడా పూర్తయిపోయింది. కాళోజీ పుట్టిన రోజు సెప్టెంబర్ 9న ఈ సినిమాను విడుదల చేయాలని మూవీ టీమ్ సన్నాహాలు చేస్తోంది.