నగల యాడ్‎..హీరోయిన్‎కు సమానంగా సితార రెమ్యునరేషన్

Update: 2023-07-05 15:32 GMT

ఓ వైపు పాన్ ఇండియన్ సినిమాలతో ప్రిన్స్ మహేష్ బాబు బిజీగా ఉంటే..మరో వైపు మహేష్ గారాలపట్టి సితార పాప మాత్రం రికార్డులు సృష్టిస్తోంది. భారీ నగలను అలంకరించుకుని యాడ్ షూట్ చేసి న్యూయార్క్‎లోని టైమ్ స్క్వేర్ మీద తళుక్కుమని ఏ స్టార్ కిడ్ సాధించని ఘనతను సొంతం చేసుకుంది. చిన్న వయసులోనే నగల యాడ్ షూట్ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది సితార.ఇదిలా ఉంటే ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలోనూ సితార ఎక్కడికో వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. చేసింది జ్యూవెల‍్లరీ యాడ్ అయితేనేం..సితారకు భారీ మొత్తంలోనే ముట్టచెప్పినట్లు టాక్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. ఓ హీరోయిన్ తన సినిమా కోసం తీసుకునేంత పారితోషకం సితార తీసుకుందని సమాచారం.

సూపర్‌స్టార్ మహేష్ బాబు సంవత్సరానికి ఓ సినిమా చేస్తుంటాడు. సినిమాలతో పాటు యాడ్స్, ప్రమోషన్స్ రూపంలోనూ మరోవైపు నుంచి గట్టిగానే సంపాదిస్తున్నాడు. సినిమాలతో, యాడ్లతో కోట్లకు కోట్లు ఆర్జిస్తుంటాడు సూపర్ స్టార్. ఇప్పుడు అదే స్థాయిలో కూతురు సితార కూడా భారీ మొత్తంలో రెమ్యునరేషన్ పొందుతోంది. ఈ మధ్యకాలంలో సితారకు చాలా ఆఫర్స్ వచ్చాయట. కానీ మహేష్ ఎందుకో వాటిని రిజెక్ట్ చేశాడట. లేటెస్టుగా జ్యూవెల్లరీ యాడ్ కు మాత్రం సితార నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ యాడ్ షూట్ జరిగి చాలా రోజులే అవుతోంది. కానీ తాజాగా ఆ వీడియోని న్యూయార్క్ లోని టైమ్ స్క్వేర్ లో ప్రదర్శించడంతో అందరి దృష్టి సితారపై పడింది. సోషల్ మీడియాలో ఈ వీడియో ఓ రేంజ్‎లో వైరల్ అయ్యింది. మహేశ్ సైతం ఈ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసి కూతురు ఎదుగుదలను చూసి తెగ మురిసిపోయాడు. ఈ యాడ్‎లో సితార యాక్ట్ చేసినందుకు గానూ ఏకంగా ఆ జ్యూవెల్లరీ సంస్థ రూ.కోటి పారితోషకం ఇచ్చిందట. బహుశా మహేశ్ కూడా తన మొదటి యాడ్‎కు ఇంత రెమ్యునరేషన్ తీసుకుని ఉండడు. అందుకే సితార యాడ్ షూట్ కి ఒప్పుకున్నాడే వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఇంత చిన్న ఏజ్‎లో అంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుని సితార నాన్న పేరును నిలబెట్టింది.

Tags:    

Similar News