షూటింగ్ స్పాట్‌‌లో 'సలార్‌' విలన్‌‌కు ప్రమాదం..

3 నెలల పాటు షూటింగ్‌కు బ్రేక్!!;

Update: 2023-06-26 02:41 GMT




మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ షూటింగులో తీవ్రంగా గాయపడ్డారు. యాక్షన్ సీన్ షూటింగులో ఆయనకు బలమైన గాయం తగలడంతో స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ మలయాళ చిత్రం..'విలాయత్ బుద్ద' షూటింగులో పాల్గొంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్స్ షూట్ చేస్తుండగా.. ఆయనకు ప్రమాదం జరిగింది. KSRTC బస్సులో ఓ ఫైట్‌ సీన్‌ను షూట్‌ చేస్తుండగా ఆయన జారి కిందపడ్డాడు. దీంతో ఆయన కాలికి గాయం అయింది. వెంటనే ఆయనను చికిత్స కోసం కొచ్చిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు.

ఈ ఉదయం పృథ్వీరాజ్ కు డాక్టర్లు సర్జరీ చేయనున్నారు. ఈ ఆపరేషన్ తరువాత పృథ్వీరాజ్ సుమారు మూడు నెలలు రెస్ట్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఆయన ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ తిరిగి రావాలి. గాయం నుంచి త్వరగా కోలుకోవాలి అని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గెట్ వెల్ సూన్ అంటూ ఆయనకు సందేశాలు అందిస్తూ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.

పృథ్వీరాజ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి పృథ్వీరాజ్ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో వరదరాజ మన్నార్ గా నటిస్తున్నాడు. యాక్సిడెంట్ విషయం తెలియడంతో తెలుగు అభిమానులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.



Tags:    

Similar News