Siddharth: చిత్తా మూవీ ప్రమోషన్.. హీరో సిద్ధార్థ్కు షాకిచ్చిన ఆందోళనకారులు..

By :  Kiran
Update: 2023-09-28 14:51 GMT

హీరో సిద్ధార్థ్కు చేదు అనుభవం ఎదురైంది. ‘చిత్తా’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా గురువారం బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రోగ్రాంలో భాగంగా సిద్ధార్థ్ ఆడియెన్స్తో మాట్లాడుతుండగా కర్నాటక రక్షణ వేదిక సభ్యులు ఒక్కసారిగా హాల్లోకి దూసుకొచ్చారు. తమిళ సినిమాను కన్నడనాట ఎందుకు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చారు.

ఆందోళనకారులను పట్టించుకోకుండా సిద్ధార్థ్ మరోసారి మాట్లాడే ప్రయత్నం చేశారు. దీంతో నిరసనకారులు నినాదాలతో హోరెత్తించారు. దీంతో కార్యక్రమం కాస్తా రచ్చ రచ్చగా మారింది. సిద్ధార్థ్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆందోళనకారులు వెనక్కితగ్గలేదు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో మా సినిమాను ఆదరించండంటూ సిద్ధార్థ్ అక్కడి నుంచి స్టేజ్ దిగి వెళ్లిపోయారు. కావేరీ జలాల విషయంలో కర్నాటక, తమిళనాడు మధ్య వివాదం తారాస్థాయికి చేరిన సమయంలో సిద్ధార్థ్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని నిరసనకారులు తీవ్రంగా తప్పుబట్టారు.

Tags:    

Similar News