కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కపై సినిమా తీస్తానని నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తెలిపారు. "నమ్ముకున్న ప్రజల కోసం.. అహర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మెల్యే సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు" అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. దీనికి ఓ అభిమాని " మోహన్ బాబు గారి 'అడవిలో అన్న', రానా గారి 'లీడర్' సినిమాలు కలిపితే నిజ జీవితంలో సీతక్క సినిమా అవుతుందని మీరు తీయాలన్నా .." అంటూ కామెంట్ చేశారు. స్పందించిన బండ్ల.. "అద్భుతమైన సలహా.. తప్పకుండా ఆలోచిస్తా.. సినిమా తీస్తా" అని కామెంట్ చేశారు
నక్సల్ ఉద్యమానికి ఆకర్షితురాలైన సీతక్క అలియాస్ ధనసరి అనసూయ కొన్నేళ్లపాటు నక్సల్ ఉద్యమంలో కొనసాగారు. అనంతరం జనజీవన స్రవంతిలో కలిసి 2009లో ములుగు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2014లో ఓటమి పాలైన ఆమె అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ లో చేరారు. ఈ క్రమంలోనే 2018లో ములుగు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున సీతక్క రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఇదిలా ఉండగా.. ఈరోజు అమెరికాలో జరగుతోన్న తానా సభల్లో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ఈ క్రమంలోనే నిర్వాహకులు, హీరో బాలకృష్ణ ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సీతక్క ఎమోషనల్ అయ్యారు. అడవి నుంచి అమెరికా వరకు అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేశారు. వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించిన తానా జాతీయ సదస్సుకు, తనను ఎంతో ప్రేమతో స్వాగతం పలికిన ప్రతిఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.
Forest to America / అడవి నుంచి అమెరికా..
— Danasari Seethakka (@seethakkaMLA) July 8, 2023
I thank the TANA National conference for the opportunity to take part in the celebrations, I thank everyone who welcomed me with great love over here
Thank you all..
🔥Thank you Bala Krishna Garu..@RahulGandhi @priyankagandhi @kharge pic.twitter.com/K6uy7dOy1x