గుంటూరు కారం.. అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా. ఈ కాంబోలో హ్యాట్రిక్ మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే రిలీజైన ఫస్ట్ సాంగ్కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. దమ్ మసాలా సాంగ్ దుమ్మురేపింది. ఈ సాంగ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదరుచూశారు. ఎట్టకేలకు దసరా ముందు ఈ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే సెకండ్ సాంగ్కు సంబంధించి నిర్మాత నాగవంశీ కీలక అప్ డేట్ ఇచ్చారు.
ఆదికేశవ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న నాగవంశీకి గుంటూరు కారం మూవీకి సంబంధించిన క్వశ్చన్ ఎదురైంది. ఈ సందర్భంగా ఆయన కీలక విషయాలను వెల్లడించారు. వచ్చే వారం రెండో పాటను లాంచ్ చేస్తామని చెప్పాడు. ఈ మూవీలో మొత్తం 4 పాటలు ఉంటాయని తెలిపారు. వచ్చే ఏడాది మొత్తం పాడుకునేలా పాటలు అద్బుతంగా ఉంటాయని అన్నారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఈ మూవీ జనవరి 12న రిలీజ్ అవుతుంది. మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారికాహారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీలో జగపతి బాబు, రేఖ, రమ్యకృష్ణ, జైరాం, బ్రహ్మానందం, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.