Om Bheem Bush : ఎస్కేఎన్ .. ఇంత అహంకారం దేనికి..?

Update: 2024-03-24 11:13 GMT

చిన్న జర్నలిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి పీఆర్వో నుంచి ఇప్పుడు నిర్మాతగా ఎదిగాడు ఎస్కేఎన్. రీసెంట్ గా బేబీ అనే సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. మామూలుగానే వేదికపై ఉంటే మనోడు ఏది పడితే అది మాట్లాడుతుంటాడు.ఇంక పెద్ద సక్సెస్ పడితే కళ్లు కూడా నెత్తికెక్కుతాయి అంటారు కదా.. అలా కొందరు ఉంటారు. ఆ లిస్ట్ లోనే చేరాడు అని చెప్పలేం కానీ.. బేబీ తర్వాత ఎస్కేఎన్ మాటల్లో కాస్త అత్యుత్సాహం కనిపిస్తుంది. సెటైర్స్ కూడా పెరిగాయి. తన గురించి ఎవరైనా ఏమైనా ఇమ్మీడియొట్ గా అటాకింగ్ మోడ్ లో మాట్లాడుతున్నాడు. అది కూడా ప్రెస్ మీట్స్ లో. ఆ మధ్య లవర్ అనే సినిమాను తెలుగులో ట్రూ లవర్ పేరుతో డబ్ చేశారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మీడియాపైనా సెటైర్స్ వేశాడు. అఫ్ కోర్స్ కొన్ని సందర్భాల్లో మీడియా వాళ్లు అడిగే ప్రశ్నలు తలా తోక లేకుండా ఉంటాయి. అలాంటప్పుడు ఎస్కేఎన్ లాంటి వాళ్లు కరెక్టే అనిపిస్తుంది. బట్ వేదికపై ఉన్నప్పుడు కాస్త సంయమనం అవసరం అంటారు కదా.. అది కోల్పోయాడో లేక.. తనేదో కామెడీగా మాట్లాడుతున్నా అనుకున్నాడో కానీ లేటెస్ట్ గా ‘ఓమ్ భీమ్ బుష్’ సినిమా సక్సెస్ మీట్ లో రెండు మాటలు జారాడు. అతని గురించి తెలిసిన వాళ్లకు అది అర్థం అవుతుంది. తెలియని వారికి అహంకారంలా కనిపిస్తుంది.

ఓమ్ భీమ్ బుష్ సక్సెస్ మీట్ లో ఎస్కేఎన్.. ‘ ఈ మూవీ సెకండ్ హాఫ్ లో దెయ్యం వచ్చింది. నాకు దెయ్యాలంటే చాలా భయం.. అందుకే మన యాంకర్లకు కూడా దూరంగా ఉంటాను..’ అని యాంకర్ల గురించి తక్కువ చేస్తూ మాట్లాడాడు. అలాగే.. ‘ ఈ సినిమాలో చాలామంది ఫిగర్స్ .. సారీ .. చాలామంది హీరోయిన్లున్నారు ఎవరూ కనిపించడం లేదేంటీ..? ’ అని నోరు జారాడు. చూడ్డానికి ఆ కాసేపు ఫన్నీగా ఉన్నా.. అవి వాళ్ల వ్యక్తిత్వాన్ని చూపిస్తాయి. ఎదుగిన కొద్దీ ఒదగడం అనేది ఎంత పాత కొటేషన్ అయినా.. ఎప్పుడూ అప్లై చేసుకోవాల్సిన అంశమే. ఎస్కేఎన్ యాంకర్ల గురించి మాట్లాడింది మాత్రం ఖచ్చితంగా తప్పు. కాస్త ఎక్కువ మేకప్ వేసుకున్నంత మాత్రాన దెయ్యాల్లా కనిపిస్తారా..? మిగతా గెస్ట్ లతో పోలిస్తే వాళ్లు ఎక్కువ సేపు వేదికలపైనా, ప్రోగ్రామ్స్ లోనూ కనిపించాలి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఎంతోమంది యాంకర్స్ ఉన్నా.. కొందరే ఫేమస్ అయ్యారంటే దాని వెనక వారి శ్రమ ఉంటుంది. ఇవన్నీ వదిలేసి యాంకర్స్ దెయ్యాలతో పోల్చడం ఎస్కేఎన్ అహంకారానికి నిదర్శనం అంటున్నారు చాలామంది.

Tags:    

Similar News