చిన్న సినిమాగా వచ్చి టాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేసిన మూవీ బేబీ.ఆనంద్ దేవర కొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటించిన ఈ మూవీకి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. 14కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ 80కోట్లు కలెక్ట్ చేసి వారెవ్వా అనిపించింది. తమ కావాల్సిందీ స్టార్ క్యాస్ట్ కాదని.. స్టోరీలో కంటెంట్ ఉంటే చాలని ప్రేక్షకులు బేబీ సినిమాతో మరోసారి నిరూపించారు. అటు ఓటీటీలోనూ ఈ మూవీ దుమ్మురేపింది. ఓటీటీలో రిలీజైన 32 గంటల్లోనే 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి సంచలనం సృష్టించింది.
సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో నిర్మాత ఎస్కేఎన్..డైరెక్టర్ సాయి రాజేష్కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. మెర్సిడెస్ బెంజ్ కారును ఇవాళ గిఫ్టుగా ఇచ్చారు. ఎస్కేఎన్ డైరెక్టర్కు గిఫ్ట్ ఇవ్వడం ఇది రెండోసారి. ఈ సినిమా రిలీజ్కు ముందే హిట్ అవుతుందన్న నమ్మకంతో సాయి రాజేష్కు ఒక కారు గిఫ్ట్గా ఇచ్చాడు. రిలీజ్ తర్వాత ఈ మూవీ కోట్ల లాభాలు తేవడంతో మరోసారి గిఫ్ట్ ఇచ్చారు. ఈ క్రమంలో ఎస్కేఎన్ కు సాయి రాజేష్ కృతజ్ఞతలు చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
With love to my love #SaiRazesh ♥️🤗❤️
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) September 29, 2023
and many more #Babythemovies are loading ✌️ pic.twitter.com/PCjMHVn91J