చూపులతో అట్రాక్ట్ చేస్తున్న దిశా పటానీ.. Prokect K బర్త్ డే విషెస్

Update: 2023-06-14 04:17 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్.. మరో రెండ్రోజుల్లో రిలీజ్ కానుంది. సినీ అభిమానులంతా ఈ సినిమా కోసమే ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రభాస్ నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్... ప్రాజెక్ట్ కె కూడా ట్రెండింగ్ లోకి వచ్చింది. ప్రాజెక్ట్ కె నుంచి చిన్న అప్డేట్ వచ్చిన సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతోంది.



ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దుల్కర్ సల్మాన్ లాంటి వాళ్ళు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ దిశా పటాని కూడా ఒక రోల్ ప్లే చేస్తోంది. నిన్న దిశా పటాని 31వ బర్త్ డే. ఆమె బర్త్ డే సందర్భంగా ప్రాజెక్ట్ కె చిత్ర యూనిట్ ఆమె లుక్ ని వదిలారు. కంప్లీట్ లుక్ రివీల్ చేయకుండా ఆమె కళ్ళు మాత్రమే హైలైట్ చేస్తూ టీజింగ్ లాంటి పోస్టర్ వదిలారు. అందంగా ఉన్న కళ్ళు.. నుదిటిపై చుక్కలు చూస్తుంటే దిశా పటాని రోల్ చాలా బలంగా, ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు అర్థం అవుతోంది.



దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రంతో ఇండియన్ సినిమాలో ఎప్పుడూ చేయని సాహసం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ సంస్థ దాదాపు 500 కోట్లకి పైగా బడ్జెట్ లో నిర్మిస్తోంది. ఈ చిత్ర పూర్తి టైటిల్ ప్రాజెక్ట్ కర్ణ లేదా ప్రాజెక్ట్ కృష్ణ అని ఉండబోతున్నట్లు లీకులు అందుతున్నాయి. ఈ చిత్రం ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఉండబోతోందని.. ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించబోతున్నాడని అంటున్నారు. ఏది ఏమైనా నాగ్ అశ్విన్ కనీవినీ ఎరుగని రీతిలో ఈ చిత్రాన్ని తీర్చి దిద్దుతున్నాడు. 



Tags:    

Similar News