కోలీవుడ్ దర్శకుడు విఘ్నేశ్ శివన్, నయనతారల జంట మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ జంటపై విఘ్నేశ్ కుటుంబ సభ్యులు ఆస్తి అపహరణ కేసు నమోదు చేశారు. ఆరేళ్లు లవ్ చేసుకుని అనంతరం కొంత కాలం సహజీవనం చేసి రెండేళ్ల క్రితం పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు ఈ సంచలన జంట. వీరి ప్రేమ, పెళ్లి దగ్గరి నుంచి పిల్లల వరకు అనేక వివాదాలు ఈ దంపతులను చుట్టుముట్టాయి. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్న నయనతార ఫ్యామిలీ లైఫ్లో హ్యాపీగా ఉన్నా వ్యక్తిగతంగా పలు సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జంటకు మరో సమస్య ఎదురైంది.
తిరుచ్చి జిల్లా, లాల్‌కుడి గ్రామంలో పూర్వికుల నుంచి విఘ్నేశ్ శివన్ తండ్రి శివకొళుదికి ఉమ్మడి ఆస్తి వచ్చింది. శివకొళుది అప్పట్లో పోలీస్ ఇన్ఫార్మర్గా పని చేసేశారు. ఆయన ఇప్పుడు లేరు. అయితే శివకొళుదికి బతికున్నప్పుడే గా తమ ఉమ్మడి ఆస్తిని తమకు తెలియకుండా మోసం చేసి అమ్మాడని అతని సోదరులు తాజాగా తిరిచ్చి డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
తమ ఆస్తిని కొనుగోలు చేసిన వారికి డబ్బును తిరిగి ఇచ్చి, ఆస్తిని తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.అంతటితో ఆగలేదు తమ సోదరుడి కుమారుడు విఘ్నేశ్ శివన్, అతని భార్య నయన తారతో పాటు తల్లి మీనాకుమారి, సోదరి ఐశ్వర్య పైన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్లో తెలిపారు. దీంతో తిరుచ్చి డీఎస్పీ ఈ కేసు దర్యాప్తు చేయమని పోలీసులను ఆదేశించారు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోసారి నటి నయనతారకు ఈ అంశం తలనొప్పిగా మారింది.