సుకుమార్ గట్టి ప్లానే వేస్తుండు.. వందల లారీలతో...

Byline :  Krishna
Update: 2023-09-07 11:27 GMT

పుష్ప.. ఎన్నో రికార్డులను బద్దలుకొట్టిన మూవీ. ఈ సినిమా దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ స్పెషల్ క్రేజ్ తీసుకరావడమే కాదు జాతీయ అవార్డును సైతం తెచ్చిపెట్టింది. తెలుగులో ఏ హీరో సాధించిన ఘనతను ఈ మూవీతో బన్నీ సాధించాడు. పార్ట్ 1 కు ఏ మాత్రం తగ్గకుండా తాన్ని మించేలా పుష్ప 2 తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ క్రమంలో పుష్ప సెట్స్ నుంచి ఓ వీడియో లీకైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో వందల లారీలు కన్పిస్తున్నాయి. ఒకదాని వెనుక ఒకటి లైన్లో వీటిని పార్క్ చేశారు. వీటిని చూస్తుంటే భారీ యాక్షన్ సీన్స్ కు సుకుమార్ ప్లాన్ చేసినట్లుగా అర్ధమవుతోంది. పార్ట్ 1లో లారీలతో పుష్ప చేసిన స్టంట్స్కు థియేటర్లలో విజిల్స్ వేయించాయి. ఈ క్రమంలోనే మళ్లీ లారీలతో బన్నీ విజిల్స్ వేయించేందుకు సిద్ధమయ్యారని ఫ్యాన్స్ అంటున్నారు.

ఫస్ట్ పార్ట్ కు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చి నేషనల్ అవార్డు అందుకున్న దేవి శ్రీ ప్రసాద్ పార్ట్ 2 కు కూడా అదే రేంజ్ లో ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇక ఈ మూవీలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా.. ఫాహద్ ఫాజిల్ విలన్గా చేస్తున్నారు. అటు లీక్ వీడియోలతోనూ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో పెరుగుతున్నాయి. వచ్చే ఏడాది రిలీజ్ కానున్న ఈ సినిమా.. ఎన్ని రికార్డులను బద్దలుకొడుతుందో వెయిట్ అండ్ సీ..

Full View

Tags:    

Similar News