సినిమా రంగంలో మాధవన్కు కీలక బాధ్యతలు

Byline :  Kiran
Update: 2023-09-01 17:00 GMT

విలక్షణ నటుడు ఆర్. మాధవన్‌కు అరుదైన గౌరవం దక్కింది. సినీ రంగానికి సంబంధించి కేంద్రం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది. ఆర్ మాధవన్‌ను ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) అధ్యక్షుడిగా, గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్గా నియమించింది. FTII అధ్యక్షుడిగా ఎన్నికైన మాధవన్‌ ను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అభినందించారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆయనను అభినందిస్తూ ట్వీట్ చేశారు.

"సినిమా పరిశ్రమలో మీకు ఉన్న అనుభవం.. మీ నైతిక విలువలతో FTII ఉన్నత ప్రమాణాలను నెలకొల్పుతారనే నమ్మకం ఉంది. సినిమా పరిశ్రమలో సానుకూల మార్పులు తీసుకొస్తారని, సినీ ప్రపంచంలో ఇండియన్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాను" అని అనురాగ్ ఠాకూర్ ట్వీట్లో రాశారు.

మాధవన్ నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా పలు చిత్రాలను రూపొందించారు. ఇస్ రాత్ కీ సుభాస్ నహీ సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన.. తర్వాత ఇన్‌ఫెర్నో ఇంగ్లీష్ చిత్రంలో నటించాడు. అనంతరం మణిరత్నం డైరెక్షన్లో అలైపాయుతే (తెలుగులో సఖి), ఓం శాంతి ఓం, మిన్నలే, ముంబై మేరీ జాన్, 3 ఇడియెట్స్, తను వెడ్స్ మను: రిటర్న్, మారా, సైలెన్స్ తదితర చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం మాధవన్ అమ్రికీ పండిట్, టెస్ట్, శంకర్ నారాయణ్ నాయర్ బయోపిక్, వష్, జీడీ నాయుడు బయోపిక్ తదితర చిత్రాల్లో బిజీగా ఉన్నాడు.




Tags:    

Similar News