Raayan: 'రాయన్‌'లో ఎస్.జే. సూర్య ఫస్ట్ లుక్.. ధనుష్ కామెంట్ ఇదే

Byline :  Veerendra Prasad
Update: 2024-02-22 05:26 GMT

తమిళ స్టార్ హీరో ధనుష్ తన 50వ సినిమాగా రాయన్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కథ, దర్శకత్వం ఆయనే. ఇటీవలె ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కాగా.. పోస్టర్‌లో తనతో పాటు మరో ఇద్దరు హీరోలు సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ కు చోటిచ్చాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో ముగ్గురు హీరోలూ ఇంటెన్స్ గా కనిపించారు. ఒక ఫుడ్ ట్రక్ ముందు ఒక ఆయుధాన్ని పట్టుకుని ఉన్నారు. ఫుడ్ ట్రక్ లో సందీప్ కిషన్, కాళిదాసు జయరాం కూడా ఆయుధాలు పట్టుకుని ఉన్నారు. అయితే యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతోన్న ఈ సినిమా నుంచి మరో పోస్టర్ విడుదల చేసింది మూవీ యూనిట్. సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ప్రముఖ డైరెక్టర్ ఎస్.జే. సూర్య లుక్ ను.. డైరెక్టర్ కమ్ హీరో ధనుష్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

ఈ పోస్టర్ లో సూర్య కుర్చీలో కాలుపై కాలు వేసుకొని కూర్చుని ఒక చేతిలో గ్లాస్ పట్టుకొని ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ పోస్టర్ పై స్పందించిన ధనుష్..ఎస్ జే సూర్యను ఉద్దేశించి “ మీకు దర్శకత్వం వహించడం చాలా ఆనందంగా ఉంది" అంటూ ఓ స్మైలీ ఎమోజీతో కామెంట్ చేశాడు. ఈ ట్వీట్ కు సూర్య కూడా రిట్వీట్ చేస్తూ.. “సార్.. మీ డైరెక్షన్‌లో నటించడం చాలా ఆనందంగా ఉంది. రాయన్ లో అవకాశం ఇచ్చినందుకు, మీ ట్వీట్ కు చాలా థాంక్స్. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా RAAYAN.. రా అండ్ రస్టిక్‌గా అంతర్జాతీయ ప్రమాణాలతో ఎమోషనల్‌గా రాబోతుంది. ప్రేక్షకులకు సమ్మర్ ట్రీట్ ఇదే. థాంక్స్" అంటూ ప్రశంసించాడు.

ఇక ఈ మూవీ లో నిత్యామీనన్, అపర్ణ బాలమురళి, వరలక్ష్మి శరత్ కుమార్, అనికా సురేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. తమిళంతో పాటుగా తెలుగు, హిందీ భాషల్లో కూడా ఈ మూవీ రిలీజ్ అవ్వబోతోంది. స్వీయ దర్శకత్వంలో వస్తున్న ధనుష్ సినిమా కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి. పైగా ఇప్పటి దాకా సినిమాకి సంబంధించిన అప్డేట్లు కూడా ఎక్స్పెక్టేషన్స్ని భారీగానే పెంచేశాయి.

Tags:    

Similar News