ఫ్రెంచ్ సినిమాలో నటిస్తున్న రాధిక..

Update: 2023-10-25 08:02 GMT

 ప్రముఖ దక్షిణాది నటి రాధికా శరత్ కుమార్ సినీ కెరీర్‌లో సరికొత్త ప్రయాణం మొదలైంది. ఆమె ఓ విదేశీ చిత్రంలో ఆఫర్ వచ్చింది. ఫ్రెంచ్ భాషలో తీస్తున్న ఓ మూవీలో నటించడానికి ఆమె ఫ్రాన్స్ వెళ్లింది. ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో నటించి తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న రాధిక ఫారిన్ మూవీ జర్నీని ప్రారంభిండంతో ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రాన్స్ పర్యటన ఫొటోలను రాధిక సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆమె బెల్ బాటమ్ ప్యాంటు, మందపాటు కోటు ధరించి గెటప్‌ను మార్చేశారు. ఫ్రెంచ్‌ చిత్రంలో నటించడానికి తన భర్త శరత్‌ కుమార్‌ ప్రోత్సహించాడని ఆయన కృతజ్ఞతలు చెబతున్నానని అన్నారు. 1978లో సినీరంగ ప్రవేశం చేసిన రాధిక టాప్ హీరోలందరీ సరసనా నటించారు. హిందీలోనూ కొన్ని సినిమాలు చేసినా శ్రీదేవీ, జయప్రద వంటివారితోపాటు ఉత్తరాది తారల నుంచీ పోటీ తట్టుకోలేక దక్షిణాదికే పరిమితయ్యారు. సినీ అవకాశాలు తగ్గాక బుల్లితెరపై మళ్లి పలు హిట్ సీరియళ్లలో నటించారు.

 Full View

Tags:    

Similar News