Kusitha Kallapu : రాడిసన్ డ్రగ్స్ కేసు.. లిషీ మిస్సింగ్.. పోలీసులకు కుషిత ఫిర్యాదు

Byline :  Krishna
Update: 2024-02-29 07:22 GMT

రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న నటి లిషీ పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. లిషీ ఇంటికి మూడు రోజుల క్రితం గచ్చిబౌలి పోలీసులు నోటీసులు అంటించారు. ఇప్పుడు ఆ నోటీసులకు ఆమె సిస్టర్ కుషిత రిప్లై ఇచ్చింది. లాయర్తో కలిసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఆమె.. లిషిత కనపడటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. లిషిత రాగానే విచారణకు పంపిస్తామని పోలీసులకు వివరించింది.




 


లిషిత విచారణకు కచ్చితంగా రావాలని పోలీసులు తేల్చి చెప్పారు. డ్రగ్స్ కేసు తెర పైకి వచ్చినప్పటి నుంచి లిషిత కనబడటం లేదు. 2022లోనూ ఓ డ్రగ్స్ కేసులో లిషితో పాటు ఆమె సోదరి కుషిత పేరు వినిపించింది. ఇప్పటికే ఈ కేసులో 10 మందిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. అందులో నలుగురిని అరెస్ట్ చేయగా.. మిగితా వారి కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో డైరెక్టర్ క్రిష్ ను 10వ నిందితుడిగా చేర్చిన పోలీసులు.. ఆయన్ను శుక్రవారం విచారించనున్నారు. క్రిష్ నిన్ననే విచారణకు హాజరుకావాల్సి ఉన్నా.. కొన్ని కారణాలతో శుక్రవారం హాజరవుతానని పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరి ఆయన విచారణకు హాజరవుతారా లేదా అన్నది వేచి చూడాలి




 


Tags:    

Similar News