మహేష్కు రాజమౌళి కండీషన్స్

By :  Babu Rao
Update: 2024-02-24 11:11 GMT

మహేష్ బాబు.. చూడగానే సుకుమారుడు అనిపిస్తాడు. చేయి తగిలితేనే కందిపోతాడేమో అనిపిస్తాడు.అలాంటి మహేష్ బాబుకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటి వరకూ ఎప్పుడూ లేనంత హార్డ్ వర్క్ స్టార్ట్ కాబోతోంది. ఒళ్లొంచి.. కండలు పెంచుతూ.. వందల రోప్ షాట్స్ తో ఒళ్లు హూనం చేసుకోవడానికి మెంటల్ గా ప్రిపేర్ అవుతున్నాడు. అందుకే కొన్నాళ్లుగా బయట కనిపించడం లేదు. అయినా ఇదంతా ఏంటో ఇప్పటికే అర్థమైందనుకుంటా..? యస్.. రాజమౌళి డైరెక్షన్ లో చేయబోతోన్న సినిమా కోసమే.. మహేష్ ఒళ్లు హూనం చేసుకుంటున్నాడు. అన్నట్టు ఈ మూవీకి సంబంధించి సూపర్ స్టార్ కు ఓ కొత్త కండీషన్ కూడా పెట్టాడట రాజమౌళి.

టాలీవుడ్ మొత్తం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తోన్న కాంబినేషన్ అంటే రాజమౌళి, మహేష్ బాబుదే.రాజమౌళి చేసింది తక్కువ సినిమాలే అయినా ఒక్కోటీ అతనితో పాటు ఆయా హీరోల రేంజ్ ను పెంచినవే. ఈగ, బాహుబలి రెండు భాగాలు, ఆర్ఆర్ఆర్ తో అతనిప్పుడు ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయ్యాడు. రాజమౌళి నుంచి సినిమా వస్తోందంటే జేమ్స్ కేమరూన్ నుంచి అప్ కమింగ్ డైరెక్టర్స్ వరకూ తెలియని వాళ్లు లేరు. ఆ రేంజ్ లో పేరు తెచ్చుకున్నాడు. ఈ మూవీ తర్వాత మహేష్ బాబుకు కూడా ఆ రేంజ్ వచ్చేస్తుంది. ఇప్పటి వరకూ సూపర్ స్టార్ ప్యాన్ ఇండియన్ స్టార్ కూడా కాదు. కానీ రాజమౌళి సినిమాతో ఒక్కసారిగా వరల్డ్ వైడ్ ఆడియన్స్ కూ గ్రాండ్ గా పరిచయం అవుతాడు. అందుకే ఇన్నాళ్లూ సుకుమారంగా చూసుకున్న ఒళ్లు హూనం చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. వీరి కాంబోలో రూపొందే సినిమా అమెజాన్ అడవుల్లో సాగే అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ అని ముందు నుంచీ చెబుతున్నారు. అంటే అంతర్జాతీయ స్థాయిలో ఉండబోతోందన్నమాట. ఇప్పటికే ఈ సినిమా కోసం కొన్ని మార్షల్ ఆర్ట్స్ ను కూడా నేర్చుకుంటున్నాడు మహేష్ బాబు. త్వరలోనే పూర్తి స్థాయిలో సినిమా కోసం రెడీ అవుతాడట. ఆ తర్వాతే షూటింగ్ స్టార్ట్ అవుతుందంటున్నారు. అయితే ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మహేష్ బాబు తన లుక్ ను బటయ పెట్టేలా ఎలాంటి పబ్లిక్ ప్లేసెస్ కూ వెళ్లొద్దని.. ఆ లుక్ రివీల్ అయ్యే ఏ పనీ చేయొద్దనే కండీషన్ పెట్టాడట రాజమౌళి. ఫిట్ గా ఉండేందుకు ఎన్ని జాగ్రత్తలైనా తీసుకోవచ్చు. కానీ ఇలా పబ్లిక్ లోకి రాకుండా మహేష్ ను ఆపడం సాధ్యమా అనేదే పెద్ద ప్రశ్న. ఎందుకంటే చిన్న గ్యాప్ దొరికినా వెకేషన్స్ కు వెళ్లిపోతుంటాడు. పైగా యాడ్స్ కూడా చాలానే ఉన్నాయి. అలా అయినా లుక్ బయటకువస్తుంది కదా..? అయినా రాజమౌళి ఏదైనా చెబితే హీరోలు ఖచ్చితంగా పాటించాల్సిందే కదా. అందుకే మహేష్ ఈ కండీషన్స్ కుఒప్పుకునే ఉంటాడు అనుకోవచ్చు. ఏదేమైనా ఈ మూవీ మహేష్ కే కాదు.. రాజమౌళికి కూడా ఓ పెద్ద ఛాలెంజ్ గా ఉండబోతోందని మాత్రం చెప్పాలి. సూపర్ స్టార్ సరసన ఇండియాతో పాటు విదేశాలకూ చెందిన హీరోయిన్లూ రొమాన్స్ చేస్తారట. మరి హాలీవుడ్ రేంజ్ మూవీ అంటే ఆ మాత్రం ఉండాలి కదా..? ఏదేమైనా జక్కన్న ఇప్పటి వరకూ మార్కెటింగ్ పరంగా ఇండియాపైనే ఎక్కువ ఫోకస్ చేశాడు. ఈ మూవీతో వాల్డ్ మార్కెట్ పైనే కన్నేశాడట. సో.. సినిమా ఏ మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నా.. ఇప్పట్లో ఇండియన్ డైరెక్టర్స్ ఎవరూ ఛేదించలేని రికార్డ్స్ సెట్ చేస్తాడని మాత్రం అనుకోవచ్చు.

Tags:    

Similar News