LAL SALAM Trailer Out .. రజనీకాంత్ డైలాగ్స్ హైలట్.. డబ్బింగ్ ఎవరు చెప్పారో తెలుసా?
సూపర్ స్టార్ రజనీకాంత్ గెస్ట్ రోల్ పోషించిన తాజా చిత్రం లాల్ సలామ్. విష్ణు విశాల్ హీరోగా వస్తున్న ఈ సినిమాను రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మొయిద్దీన్ భాయ్ గా రజనీకాంత్ కనిపించనున్నాడు. శుక్రవారం (ఫిబ్రవరి 9) ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో.. చిత్ర బృదం ట్రైలర్ ను లాంచ్ చేసింది. సినిమాలోని ప్రధాన పాత్రలతో కట్ చేసిన ఈ ట్రేలర్ ఆకట్టుకుంది.
ప్రశాంతంగా ఉన్న ఊళ్లో.. మతం చిచ్చు ఎలా రగిలింది. రెండుగా విడిపోయి ఎలా కొట్టుకున్నారు. మతం, మానవత్వం గురించి చెప్తూ ట్రైలర్ సాగుతుంది. ట్రైలర్ చివర్లో మతం కంటే మానవత్వం గొప్పది అంటూ రజనీకాంత్ ఓ డైలాగ్ చెప్తాడు. ఈ డైలాగ్ ట్రైలర్ కు హైలట్ గా నిలిచింది. రజనీ లుక్, స్టైల్ ప్రత్యేక ఆకర్శనగా నిలిచాయి. కాగా ఈ సినిమాలో రజనీకాంత్ కు సాయికుమార్ డబ్బింగ్ చెప్పాడు. ఒకవైపు గ్రామీణ రాజకీయాలు, మరోవైపు క్రికెట్ నేపథ్యంలో సాగే కథలో.. మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అతిథి పాత్రలో కనిపించారని టాక్. కాగా రజనీకాంత్ కు సాయికుమార్ డబ్బింగ్ కాస్త కొత్తగా అనిపిస్తుంది.