జైలర్ గోల్డ్ పండగ.. 300 మందికి అవి.. ముగ్గురికి ఇవి...

By :  Lenin
Update: 2023-09-10 16:47 GMT

స్టైలిష్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'జైలర్' వసూళ్ల జడివాన కురిపిస్తోంది. కళ్లు తిరిగిపోయే లాభాలు వచ్చిపడుతున్నాయి. అంత సొమ్మును ఏం చేసుకోవాలో తెలియక నిర్మాత కళానిధి మారన్ కానుకల వర్షం కురిపిస్తున్నారు. వందల కోట్ల లాభాలు రావగడంతో మూవీ టీమ్‌కు పండగ చేస్తున్నారు. కోలీవుడ్ వార్తల ప్రకారం ఇప్పటికే రజనీకి 210 కోట్ల పారితోషికం ముట్టజెప్పిన మారన్ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకున్న వర్కర్లకు, ఆర్టిస్టులకు కూడా ఖరీదైన బహుమతులు అందించారు. 300 మందికి బంగారు నాణేలు అందజేశారు. అలాగే రజనీకి బీఎండబ్ల్యూ కారును, దర్శకుడు నెల్సన్‌కు, సంగీత దర్శకుడు అనిరుధ్ పోర్షే కార్లను కానుకగా అందించారు. గిఫ్టుల పంపకం కార్యాక్రమం వీడియోను కూడా మారన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానుకలు అందించాక టీమ్‌కు మాంచి విందు భోజనం కూడా పెట్టించారు.

జైలర్ చిత్రానికి ప్రపంచవ్యాప్తగా కలిపి దాదాపు రూ. 700కు పైగా వసూళ్లు వచ్చాయి. ఒక్క తమిళనాడులోనే రూ. 200 కోట్లు కొల్లగొట్టింది. కర్ణాటకలో రూ. 70 కోట్లు, కేరళలో రూ. 55 కోట్ల రూపాయిల వసూళ్లు వచ్చాయి. తెలుగు వెర్షన్ రూ. 50 కోట్లు తెచ్చిపెట్టింది. రోబో సిరీస్ తర్వాత తలైవాకు తెలుగులో ఆ స్థాయి కలెక్షన్లు రావడం ఇదే తొలిసారి.


Tags:    

Similar News