Twitter review: జైలర్ ట్విట్టర్ రివ్యూ.. సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవల్

Update: 2023-08-10 04:50 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో ఫిమేల్ లీడ్ గా తమన్నా నటించింది. ఇక రమ్యకృష్ణ, వసంత్ రవి కీలక పాత్రల్లో నటించారు. తలైవా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. సూపర్ స్టార్ గత చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దీనితో రజనీ అభిమానులు నెల్సన్ పైనే ఆశలు పెట్టుకున్నారు. ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడంతో ఫస్ట్ డే ఫస్ట్ షోకి థియేటర్స్ వద్ద కోలాహలం నెలకొంది. సెలవులు పెట్టి మరీ రజనీ అభిమానులు జైలర్ చిత్రానికి వెళుతున్నారు. యూఎస్ లో కూడా ప్రీమియర్ షోల సందడి మొదలయింది. ప్రీమియర్ షోల నుంచి ఈ చిత్రానికి రిపోర్ట్స్ వస్తున్నాయి. సినిమా చూసిన వారు కొందరు.. ట్విట్టర్‌లో రివ్యూలు, పోస్టులు పెడుతున్నారు.

2 గంటల 48 నిమిషాల నిడివిగల ఈ సినిమాలో రజనీ యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ అంటున్నారు ఫ్యాన్స్. ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని, ఇంట్రో సీన్ నెక్ట్స్ లెవెల్ అని తెలుస్తోంది. కామెడీ సీన్స్ సూపర్బ్‌గా ఉన్నాయట. డైలాగ్స్, తెలుగు డబ్బింగ్ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఉందని టాక్. టైగర్ కా హుకుమ్ పాట, ఇంట్రవెల్ ఎలివేషన్ అదిరిపోయాయని అంటున్నారు. ఫస్ట్ హాఫ్‌లో రజినీ, యోగిబాబు మధ్య వచ్చే సీన్లు, కామెడీ అదిరిపోయిందని అందరూ అంటున్నారు. ఎక్కువగా వారిద్దరి కామెడీ సీన్ల గురించి నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. ఇది రజినీ కోసమే తీసినట్టుగా అనిపిస్తుందంటూ, నెల్సన్ అద్భుతంగా తీశాడని, ఆడియో లాంచ్‌లో రమ్యకృష్ణ చెప్పింది నిజమే అని, నెల్సన్ ఈ సినిమాలో రజినీని అద్భుతంగా క్యాప్చర్ చేశాడని, ప్రతీ చిన్న ఎక్స్‌ప్రెషన్ అద్భుతంగా ఉందని, క్లోజప్ షాట్స్‌లో రజినీ అద్భుతంగా నటించాడని అంటున్నారు.

ఇంటర్వెల్ వరకు డైరెక్టర్ యావరేజ్ అన్నట్లుగా కథని నడిపించాడని, ఇంటర్వెల్ ఫైట్ , సెకండ్ హాఫ్ లో యాక్షన్ ఫీస్ట్ గా జైలర్ ను చూపించాడంటున్నారు. సెకండ్ హాఫ్ రజనీ ఫ్యాన్స్ కోరుకునే విధంగా నెల్సన్ కొన్ని గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్స్ పెట్టాడని చెబుతున్నారు. ఓవరాల్ గా జైలర్ చిత్రం రజనీకాంత్ కి మాత్రమే కాదు దర్శకుడు నెల్సన్ కి కూడా కంబ్యాక్ మూవీ అని అంటున్నారు. ఫస్టాఫ్ యావరేజ్ గా సాగినా సెకండ్ హాఫ్ పూర్తిగా ఆకట్టుకుంటుంది అని అంటున్నారు. అనిరుధ్ తన బిజియంతో రజనీకి అద్భుతమైన ఎలివేషన్ ఇచ్చాడంటున్నారు. అయితే కొంత మంది యాంటీ ఫ్యాన్స్ ఇప్పుడు ట్విట్టర్‌లో నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని, సినిమా చూసేవాళ్లు స్పాయిల్ చేయకండి.. ట్విస్టులు, ఇంటర్వెల్ బ్లాక్‌లు, ఎంట్రీలు షూట్ చేసి ట్విట్టర్‌లో పెట్టకండి అంటూ అభిమానులు కోరుతున్నారు.




Tags:    

Similar News