రాకేష్ మాస్టర్‌కు తన మరణం ముందే తెలుసా..!

Update: 2023-06-18 16:59 GMT

కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి అందరిని షాక్‌కు గురిచేసింది. రాకేష్ మాస్టర్ మరణవార్త విని అభిమానులు విస్మయానికి గురయ్యారు. వారం రోజుల క్రితమే షూటింగ్‎లో ఉత్సాహంగా గడిపిన రాకేష్ మాస్టర్..ఇక లేరని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. అయితే రాకేష్ మాస్టర్‌కు మాత్రం తన మరణం గురించి ముందే తెలుసని ఆయన అసిస్టెంట్ సాజిద్ వెల్లడించాడు.

రెండు నెలల క్రితమే రాకేష్ మాస్టర్ అనారోగ్యానికి గురయ్యారని తెలిపాడు. ‘హనుమాన్’ సినిమా క్లైమాక్స్ షూటింగ్‌లో పాల్గొన్న రాకేష్ మాస్టర్.. ఆ సమయంలోనే రక్తపు విరోచనాలు, వాంతులు చేసుకోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు వివరించాడు. అప్పుడే వైద్యులు రాకేష్ మాస్టర్ బ్రతకడం కష్టమని...జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారని తెలిపారు. ఆ తర్వాత మాస్టర్ నెలన్నర పాటు మద్యం ఆపేశారన్నాడు. కానీ కొంతమంది పార్టీల పేరుతో ఫోన్ చేసి మాస్టర్‌తో మద్యం తాగించారని పేర్కొన్నాడు. అలా మళ్లీ మద్యానికి అలవాటు పడినట్లు వెల్లడించాడు. ఇటీవల ‘మ్యాన్షన్ హౌస్ మై హౌస్’ షో చేయడానికి విజయనగరం వెళ్లారు’ అని సాజిద్ చెప్పుకొచ్చారు. త్వరలోనే మరిన్ని షోలకు ప్లాన్ చేశారని..ఇంతలోనే ఇలా జరగడం బాధాకరమని సాజిద్ ఆవేదన వ్యక్తం చేశాడు.

వైరల్ అవతున్న మరో వీడియో..

రాకేష్ మాస్టర్ ఇటీవల ఓ వీడియోను విడుదల చేశారు. దానిలో తన ఆరోగ్యపరిస్థితి బాలేదని చెబుతూ బాధపడ్డారు. తాను అస్తమించే సూర్యుడునని చెప్పుకొచ్చారు.ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఆయన మాట్లాడుతూ.. 'నాకు మోకాళ్ల నొప్పులు.. నా శరీరంలో మార్పులు వస్తున్నాయి.. తెలుసు, నేను అస్తమించే సూర్యుడిని.. నాకన్నీ తెలుసు' అంటూ బాధతో మాట్లాడారు.


Tags:    

Similar News