గోవాలో పెళ్లి.. రకుల్ క్లారిటీ

Update: 2024-01-01 12:52 GMT

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh), బాలీవుడ్‌ నిర్మాత జాకీ భగ్నానీ చాలా కాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. త్వరలోనే వారిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఫిబ్రవరి 22న గోవాలో వారి పెళ్లి జరగనుందంటూ పలు ఆంగ్ల వెబ్‌సైట్స్‌లు కథనాలు రాశాయి.

నేపథ్యంలో ఈ విషయంపై రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వివరణ ఇచ్చారు. తాము తప్పకుండా వివాహం చేసుకుంటామని కానీ దానికి సమయం ఉందన్నారు. నిర్మాత, నటుడు జాకీ భగ్నానీతో తాను రిలేషన్‌లో ఉన్నానంటూ 2021లో రకులే స్వయంగా ప్రకటించారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మెుదటిగా ‘గిల్లి’ అనే కన్నడ సినిమాలో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 2013 విడుదలైన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో‌’తో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ సినిమా విజయంతో ఆమెకు తెలుగులో వరస అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసిన ఈ అమ్మాయి అక్కడ నటిగా రాణిస్తున్నారు. ఆమె నటించిన ‘అయాలన్‌’ తర్వలో విడుదల కానుంది.

Tags:    

Similar News