Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి..ఎప్పుడంటే !
ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి పీటలెక్కనున్నట్ల తెలుస్తోంది. ఫిబ్రవరి 22న గోవాలో ఆమె ప్రియుడు జాకీ భగ్నానీని వివాహడనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు టాక్. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వెడ్డింగ్ జరుగునున్నట్లు తెలుస్తోంది. వీరి వివాహం కోసం ప్రత్యేక పాటలకు ట్యూన్ చేస్తున్నట్లు సమాచారం. విశాల్ పంజాబీ ఈ సౌంగ్ ట్రాక్స్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ పెళ్లి ఎప్పటికి గుర్తుండి పోవాలని ప్రముఖ ఫోటో గ్రాఫర్ విశాల్ పంజాబీని నియమించారట.. ప్రముఖులు పెళ్లిళ్లను ఇతనే షూట్ చేశారు. అంతేకాదు వీరిద్దరి పై స్పెషల్ సాంగ్ కూడా ఉన్నట్లు వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మరి ఈ పెళ్లికి అతిధులుగా ఎవరిని పిలుస్తారో తెలియాల్సి ఉంది..
ఇక ఇప్పటికే జాకీ భాగ్నాని అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కుటుంబ సభ్యులు వివాహ పనులు మొదలు పెట్టారని సమాచారం.. మరి దీనిపై ఎప్పుడు ప్రకటన ఇస్తుందో చూడాలి మరి.. ఈ మధ్య వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. టాలివుడ్ లో బిజీగా హీరోయిన్.. ఇప్పుడు మాత్రం తెలుగులో సక్సెస్ సినిమాలు లేకపోవడంతో బాలీవుడ్ లో బిజీగా ఉంది.. బాలీవుడ్ లో కూడా సరైన హిట్ పడలేదు.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫొటోలతో పాటు.. పర్సనల్ విషయాలను కూడా షేర్ చేస్తుంది.. ఎప్పుడైతే బాలీవుడ్ కి వెళ్ళిందో అప్పట్నుండి బాలీవుడ్లో నిర్మాతగా కొనసాగుతున్న జాకీ భగ్నాని తో ప్రేమాయణం సాగించింది.. వాళ్ల జంట ఎప్పుడు వార్తల్లో నిలిచేది కూడా..ఇక వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చక్కెర్లు కొడుతూనే ఉంటాయి. అంతేకాదు రకుల్ ప్రీత్ సింగ్ జాకీ తో ఉన్న బంధాన్ని కూడా బయటపెట్టింది.