రామ్ చరణ్, ఉపాసన కూతురు పేరేంటో తెలుసా..?

Update: 2023-06-22 15:42 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చిన విషయం తెలిసిందే. మెగా ఇంటికి వారసురాలు వచ్చిందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటే.. తమ ఇంటికి రాజయోగం తీసుకొచ్చే మహాలక్ష్మి పుట్టిందని ఆనందపడ్డారు కుంటుంబ సభ్యులు. ఇప్పటికే చిరంజీవి తన మనవరాలికి ‘మెగా ప్రిన్సెస్’ అని నిక్ నేమ్ పెట్టేశాడు. ఈ క్రమంలో ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్, ఉపాసన కలిసి తమ బిడ్డకు ఓ పేరు నిర్ణయించారని తెలుస్తోంది.

రామ్ చరణ్ కు అలనాటి తార అంజలీదేవి అంటే ఇష్టం అని చాలాసార్లు చెప్పాడు. ఇక తన నానమ్మ పేరు కూడా అంజనా దేవీ. అయితే, వీరిద్దరి పేర్లు కలిసేలా తన కూతురికి ‘అంజిలి’ అని పేరు పెట్టాలని రామ్ చరణ్ నిర్ణయించుకున్నాడట. ఎందుకంటే తన నానమ్మ పేరు మెగా ఫ్యామిలీకి చాలా కలిసి వచ్చింది. ప్రస్తుతం తన కూతురు జాతకం కూడా బాగుంది. జాతంకం ప్రకారం ఆమె గొప్ప స్థాయికి వెళ్తుందని, చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసనల కంటే గొప్ప పేరు తెచ్చుకుంటుందని జ్యోతిష్యులు చెప్పడంతో రామ్ చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

Tags:    

Similar News