బేబీ పుట్టాక వాళ్లతోనే ఉంటాం.. త్వరలోనే అక్కడికి షిఫ్ట్ అవుతున్నాం..- ఉపాసన

Update: 2023-06-15 16:53 GMT

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఉపాసన దంపతులు మరికొన్ని రోజుల్లో తల్లిదండ్రులు కాబోతున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత బిడ్డ పుట్టబోతుండటంతో మెగా ఫ్యామిలీలో సంతోషానికి అవధుల్లేకుండాపోయింది. పుట్టబోయే బిడ్డకు సంబంధించి తీసుకున్న ఓ నిర్ణయం గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. త్వరలోనే తాము అత్తగారింటికి షిఫ్ట్ అవుతున్నట్లు చెప్పింది.

11వ మ్యారేజ్ యానివర్సిటీ సందర్భంగా ఉపాసన ఇటీవలే ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రామ్ చరణ్ తాను త్వరలోనే అత్తమామల దగ్గరకు షిఫ్ట్ అవుతున్నామని, పుట్టబోయే బిడ్డ సంరక్షణను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

‘ దంపతులెవరైనా సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత వేరు కాపురం పెడుతుంటారు. కానీ, మేము దానికి పూర్తి భిన్నం. ప్రస్తుతం చరణ్‌ నేనూ.. మా అత్తమామలతో కాకుండా విడిగా ఉంటున్నాం. బేబీ పుట్టిన తర్వాత మాత్రం అత్తమామలతోనే ఉండాలని డిసైడ్ చేసుకున్నాం. ఎందుకంటే, మా ఇద్దరి ఎదుగుదలలో గ్రాండ్‌ పేరంట్స్‌ కీ రోల్ పోషించారు. వాళ్ల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. తాత నాన్నమ్మలతో ఉంటే వచ్చే ఆనందాన్ని మా బిడ్డకు దూరం చేయాలనుకోవడం లేదు’’ అని ఉపాసన చెప్పారు. ప్రెగ్నెన్సీ గురించి చరణ్‌కు చెప్పినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యారన్న విషయాన్ని బయటపెట్టారు. ‘ప్రెగ్నెంట్‌ అయ్యానేమోనని డౌట్ ఉందంటూ చరణ్‌కు చెప్పాను. కన్ఫార్మ్‌ అయ్యాక ఆయన ఎంతో సంతోషించారు. తన స్టైల్‌లో సెలబ్రేట్‌ చేశారు’’ అని ఉపాసన చెప్పారు.

Tags:    

Similar News