Ram Charan : అమ్మ, భార్య కోసం కిచెన్లో గరిటె పట్టిన రామ్ చరణ్

Byline :  Vinitha
Update: 2024-03-09 06:01 GMT

ఎంత మహా బలుడైనా అమ్మఒడి పసివాడే....అన్నట్లు బయట ఎంత పెద్ద గ్లోబల్ స్టార్ అయినప్పటికీ తన అమ్మ, భార్య కోసం కిచెన్ లో గరిటె పట్టాడు రామ్ చరణ్. డబ్బుంది,పేరు ఉంది, తలుచుకుంటే ఏ ఫైవ్ స్టార్ హోటల్ నుంచో తెప్పించుకోవచ్చు...లేదా ఎంత పెద్ద చెఫ్ నైనా పెట్టి వండించకుకోవచ్చు..కానీ ఉమెన్స్ డే రోజు సందర్భంగా తల్లి సురేఖ, సతీమణి ఉపాసన కోసం స్వయంగా వంట చేశాడు చరణ్. చరణ్ తల్లితో పాటు వంట చేస్తున్న వీడియోని ఉపాసన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్రేట్ హస్పెండ్, గ్రేట్ సన్ అనుకుంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

వీడియోలో ఉపాసన తెలుగులో మాట్లాడుతూ వీడియో రికార్డు చేశారు. అత్తమ్మ కిచెల్ లో ఏమైతుంది అంటూ సరదాగా అడగగా..సురేఖ కోడలి తెలుగును ఇమిటేట్ చేస్తూ ఏమైంతుంది..దోశ అయితుంది అంటూ నవ్వుతూ సమాధానం చెబుతారు. ఉమెన్స్ డే సందర్భంగా చరణ్ వంట చేస్తున్నాడని చెప్పగా...అయితే ప్రతి రోజు ఉమెన్స్ డే అయితే బాగుండూ అనుకుంటూ ఉపాసన సరదాగా చెబుతారు. ఏం చేస్తున్నారని చరణ్ ను అడగగా తల్లి కోసం పన్నీర్ టిక్కా చేస్తున్నట్లు చెబుతాడు. ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా మెగా ఫ్యాన్స్ తెగ ఆనందపడుతూ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.




 






 


 


Tags:    

Similar News