మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా తిరుమలకు వెళ్లారు. శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నప్పుడు రామ్ చరణ్ కూతురు క్లీంకార ఫేస్ రివీల్ అయ్యింది. దీంతో పాప ఎంతో క్యూట్‌గా ఉందంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ రామ్ చరణ్, ఉపాసన తమ కూతురి ఫేస్‌ను, ఫోటోలను రివీల్ చేయలేదు. గతంలో కూడా పలు సందర్భాల్లో క్లీంకార ఫేస్ రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డారు.
అయితే ఈసారి మాత్రం క్లీంకారను దాచే ప్రయత్నం చేసినా కుదరలేదు. బుధవారం ఉదయం సుప్రభాత సేవలో క్లీంకారను తీసుకుని రామ్ చరణ్, ఉపాసన బయల్దేరారు. ఆ సమయంలోనే క్లీంకార ఫేస్ కనిపించింది. ప్రస్తుతం దానికి సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకూ రామ్ చరణ్ దంపతులు క్లీంకార ఫేస్‌ని రివీల్ చేయలేదు.
మెగా అభిమానులంతా క్లీంకార ఫేస్‌ని చూసేందుకు ఎంతో ఆశ పడ్డారు. అందుకోసం ఎంతో ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య వైజాగ్ బీచ్‌లో కూడా చరణ్‌తో ఉన్న క్లీంకారను సైడ్ నుంచి చూసి తెగ సంబరపడ్డారు. అయితే ఇన్నాళ్లకు మెగా ప్రిన్సెస్ ఫేస్ రివీల్ అయ్యిందని, ఫ్రంట్ నుంచి క్లీంకార ఫేస్ కనిపించిందని సంతోషిస్తున్నారు. క్లీంకార క్యూట్‌గా ఉందంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.
KlinKara 😍😍❤️❤️❤️❤️#KlinKara pic.twitter.com/AJhjTNNaDF
— Prasannakumar Nalle (@PrasannaNalle) March 27, 2024