Ram Charan : రామ్ చరణ్ తో గేమ్స్ ఆడుతున్న శంకర్

Byline :  Babu Rao
Update: 2024-01-23 10:54 GMT

కొందరు దర్శకులతో పని చేయడం హీరోల కల. అలా ఎంతోమంది కలలు కన్న దర్శకుడు శంకర్. ఇండియన్ సినిమాకు కొత్త రంగులు అద్దిన దర్శకుడుగా అతను ఒక పేజ్ క్రియేట్ చేసుకున్నాడు. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ రేంజ్ ను కోడి రామకృష్ణ తర్వాత ఆ స్థాయిలో ప్రెజెంట్ చేసిన దర్శకుడు.కొన్నాళ్లుగా తన మ్యాజిక్ ను కోల్పోయాడు శంకర్. అయినా క్రేజ్ తగ్గలేదు. అందుకే రామ్ చరణ్ ఆయనతో సినిమాకు కమిట్ అయ్యాడు. ఎంతో గ్రాండ్ గా ఊహించుకున్న ఈ కాంబినేషన్ నిర్మాతల సహనానికి పరీక్ష పెడుతోంది. అటు అభిమానులు సైతం ఇంకెన్నాళ్లు అంటూ ఎదురుచూస్తున్నారు. ఇకనైనా స్టార్ట్ అవుతుందేమో అనుకుంటోన్న టైమ్ లో మరో బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. ఇది తెలిస్తే.. శంకర్.. రామ్ చరణ్ తో గేమ్స్ ఆడుతున్నాడు అని మాత్రం అర్థం అవుతుంది.




 


రామ్ చరణ్ ఇమేజ్ ఇప్పుడు పర్ఫెక్ట్ స్టేజ్ లో ఉంది. ఆర్ఆర్ఆర్ తో అతనికీ ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని గుర్తింపు వచ్చింది. ఆ వెంటనే శంకర్ తో సినిమా అంటే మనోడు కూడా ప్రభాస్ లా ప్యాన్ ఇండియన్ రేంజ్ లో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తాడు అనుకున్నారు. దిల్ రాజు నిర్మాతగా మొదలైన ఈ ప్రాజెక్ట్ భారతీయుడు2 వల్ల ఆగిపోయింది. కొన్ని సీక్వెన్స్ లు మాత్రమే చిత్రీకరించారు. ఒక పాట అయింది. ఓవరాల్ గా కేవలం 30శాతం మాత్రమే చిత్రీకరణ పూర్తయింది. అటు భారతీయుడు2 పూర్తయింది. ఈ సమ్మర్ లోనే విడుదల కాబోతోంది. దీంతో ఇక శంకర్ ఈ గేమ్ చేంజర్ పై దృష్టి పెడతాడు అనుకున్నారు. బట్ అతనికి ఆ ఉద్దేశ్యం లేదా అనేలా కొన్ని వార్తలు వస్తున్నాయి. విశేషం ఏంటంటే.. భారతీయుడు కు సీక్వెల్ గా వస్తోన్న భారతీయుడు2 తర్వాత దీనికీ మరో సీక్వెల్ చేయాలనుకుంటున్నాడట. ఈ మేరకు మూడో భాగానికి సంబంధించిన షూటింగ్ కూడా చాలా వరకూ పూర్తి చేశాడని టాక్. ఇంకా చెబితే మూడో భాగంలో కమల్ హాసన్ పోర్షన్ కంప్లీట్ అయిపోయిందట. మిగతా భాగాన్ని కూడా రెడీ చేస్తే ఈ ఫ్రాంచైజీ ముగిసిపోతుందని.. అందుకే గేమ్ చేంజర్ ను మరికొన్నాళ్లు ఆపాలనుకుంటున్నాడని టాక్. ఈ విషయంలో రామ్ చరణ్ తో పాటు దిల్ రాజు కూడా అసహనం వ్యక్తం చేశారట. కానీ శంకర్ లాంటి దర్శకుడు నిర్మాతల గురించి అస్సలు ఆలోచించడు. తను అనుకున్నదే చేస్తాడు. అందుకే గేమ్ చేంజర్ మరికొన్నాళ్ల పాటు పట్టాలెక్కే ఛాన్స్ లేదంటున్నారు. అందుకే రామ్ చరణ్ కూడా దీని తర్వాత కమిట్ అయిన బుచ్చిబాబు సినిమాకు సంబంధించి స్పీడ్ పెంచాడంటున్నారు. ఇప్పటికే బుచ్చిబాబు ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాడు. మొత్తంగా క్రేజీ డైరెక్టర్ అని శంకర్ తో సినిమాకు ఓకే చెబితే అతనేమో చరణ్ డేట్స్ తో గేమ్స్ ఆడుకుంటున్నాడని ఫ్యాన్స్ కూడా గుస్సా అవుతున్నారు. 


Tags:    

Similar News