పాపకు నా పోలికలే వచ్చాయి :రామ్‌ చరణ్

Update: 2023-06-23 10:07 GMT

పండంటి ఆడ బిడ్డ పుట్టాక మొదటి రామ్ చరణ్ స్పందించారు. శుక్రవారం ఉపాసన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తమ బిడ్డను తీసుకుని రామ్ చరణ్, ఉపాసన ఇంటికి వెళ్లే సమయంలో కాసేపు మీడియాతో ముచ్చటించారు. తల్లి, బిడ్డ ఇద్దరూ చాలా క్షేమంగా ఉన్నారని చెప్పారు. తమపై ప్రేమ చూపించిన అభిమానులు, శ్రేయోభిలాషులకు రామ్ చరణ్ ధన్యవాదాలు చెప్పారు. తన బిడ్డను తొలిసారిగా తాకగానే వచ్చే అనుభూతి వర్ణించలేనన్నారు. ఆ సమయంలో చాలా ఆనందంగా ఉన్నట్లు తెలిపారు. "ఎన్నో ఏళ్లగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చింది. ఆనందంలో మాటలు కూడా రావడం లేదు. 21వ రోజున ఆ పేరును తానే వెల్లడిస్తా. ఇప్పటికే ఉపాసన, తాను ఓ పేరు అనుకున్నాం ఆ రోజున అందరికీ చెబుతాం" అని రామ్ చరణ్ తెలిపారు. ‘పాపది ఎవరి పోలిక’ అన్న ప్రశ్నకు కచ్చితంగా నాన్న పోలికే అని చరణ్‌ నవ్వుతూ సమాధానం చెప్పారు.

Tags:    

Similar News