సిద్ధి వినాయకుడి పూజలో రామ్ చరణ్.. వీడియో వైరల్

Update: 2023-10-04 05:13 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుధవారం ముంబైలోని సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రస్తుతం అయ్యప్ప మాలధారణలో ఉన్న రామ్ చరణ్.. దీక్షా విరమణ సందర్భంగా సిద్ధి వినాయక ఆలయంలో పూజలు చేసినట్లు తెలిసింది. ఆలయంలో పూజలు చేస్తున్న సమయంలో ఆయన వెంట శివసేన నాయకుడు రాహుల్ కనాల్‌ కూడా ఉన్నారు. మంగళవారం సాయంత్రం రామ్ చరణ్ ముంబైకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఓ ప్రీమియర్ యాడ్ షూట్ కోసం నిన్న రాత్రి ముంబైకి చేరుకున్నారు. ఈ క్రమంలో ఎయిర్ పోర్ట్‌లో నల్లని దుస్తులు ధరించి, కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గణేశుడికి ప్రార్థనలు చేసి, చరణ్ తన 41 రోజుల అయ్యప్ప దీక్షను ముగించినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 4 తో తన 41 రోజుల అయ్యప్ప దీక్షను పూర్తైన సందర్భంగా.. తన దీక్షా సమయం ముగిసిన గుర్తుగా సిద్ధివినాయకుని ఆలయాన్ని సందర్శించారని తెలిసింది.


Tags:    

Similar News