జరగండి గేమ్ చేంజర్ వచ్చేస్తున్నాడు..రామ్ చరణ్ బర్త్ డే గిప్ట్ ఇదే..

By :  Vinitha
Update: 2024-03-06 02:13 GMT

ఆర్ఆర్ఆర్ తో వచ్చిన స్టార్ డమ్తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా మారాడు. దీంతో చరణ్ నెక్స్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం గేమ్ చేంజర్. బాలీవుడ్ హీరోయిన్ కియారా చరణ్ కు జోడిగా నటిస్తోంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ నుంచి ఒక్క అప్డేట్ కూడా రావడం లేదని అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్న సంగతి తెలిసిందే. అప్పుడెప్పుడో జరగండి..జరగండి అనే పాటను రిలీజ్ చేస్తామని మేకర్స్ అన్నారు. కానీ ఇప్పటి వరకు అడ్రస్ లేరు. కాగా ఆ పాట ఎప్పుడో లీక్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా..మెగా ఫ్యాన్స్ కు గేమ్ చేంజర్ చిత్ర బృందం అదిరిపోయే గిఫ్ట్ ప్లాన్ చేసింది. చరణ్ బర్త్ డే గిప్ట్ గా గేమ్ చేంజర్ నుంచి జరగండి అనే పాటను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర, ఎస్ జే సూర్య తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీకి దిల్ రాజు నిర్మాత కాగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమా వచ్చే దసరాకు రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. 

Tags:    

Similar News