భజనకు అలవాటు పడి.. రియాల్టీకి దూరం అవుతున్నావ్

Update: 2023-08-11 12:52 GMT

యువ హీరోలకు దీటుగా సినిమాలు తీస్తున్న చిరంజీవి వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేర్ వీరయ్యతో మెప్పించిన చిరు.. ఇప్పుడు భోళా శంకర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళంలో హిట్ అయిన సినిమా వేదాళంను రీమేక్ గా మెహర్ రమేష్ భోళా శంకర్ ను తెరకెక్కించారు. కాగా, సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైపర్ ఆది, గెటప్ శ్రీను పలువురు కమెడియన్లు చిరంజీవిని ఆకాశానికెత్తారు. చిరును పొగుడుతూ భజన చేశారు. ఈ క్రమంలో చిరంజీవికి రామ్ గోపాల్ వర్మ కౌంటర్ వేశాడు. పొగడ్తలకు అలవాటు పడి చిరంజీవి రియాల్టీకి దూరంగా ఉంటున్నాడని ట్విట్టర్ వేదికగా విమర్శించాడు. ప్రస్తుతం ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘జబర్ , హైపర్ లాంటి ఆస్థాన విదూషకుల భజన పొగడ్తలకి అలవాటుపడిపోయి , రియాల్టీ కి మెగా దూరమవుతున్నారని అనిపిస్తోంది. పొగడ్తలతో ముంచే వాళ్ల బ్యాచ్ కన్నా ప్రమాదకరమైన వాళ్లు ఉండరు. రియాల్టీ తెలిసేలోపల రాజు గారు మునిగిపోతారు. వాళ్ల పొగడ్తల విషం నుంచి తప్పించుకోవాలంటే ఆ జాతిని మైలు దూరం పెట్టటమే’ అని ఆర్జీవీ సూచించాడు. చిరు రేంజ్ అందరికీ తెలిసిందే అయినా స్టేజ్ పై కమెడియన్లు కొంత అతి చేశారని అంటున్నారు. అంతేకాకుండా చిరు.. రజినీకాంత్, కమల్ హసన్ లను చూసి నేర్చుకోవాలని, వాళ్లలా ఏజ్ కు తగ్గ సినిమాలు తీయాలని కోరుతున్నారు. ప్రస్తుతం భోళాశంకర్ సినిమాపై నెగటివ్ టాక్ వినిపిస్తోంది. అందులో జబర్దస్త్ బ్యాచ్ తో చేసిన కామెడీ వర్కౌట్ కాలేదని అంటున్నారు. ఇంకా రొటీన్ స్టోరీలను ఎంచుకుంటున్నాడని కామెంట్ చేస్తున్నారు.

https://twitter.com/RGVzoomin/status/1689916879287291904?s=20

Full View

Tags:    

Similar News