వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రాంగోపాల్ వర్మ. సోషల్ మీడియా ద్వారా వివాదస్పద పోస్ట్ లు చేస్తూ నిత్యం వార్తలో ఉండే వ్యక్తి. ఇటీవల ఆయన ఏపీ రాజకీయాలపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అధికార పార్టీ వైసీపీకి సపోర్ట్‌గా, విపక్షాలు టీడీపీ, జనసేనలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ప్రధానంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా వర్మ చేసిన సెటైరికల్ పోస్ట్‌లు దర్శనమిస్తున్నాయి. తాజాగా జననేన అధినేతను టార్గెట్ చేసి ఆర్జీవీ చేసి ఓ మార్ఫింగ్ పోస్ట్ దుమారం రేపుతోంది.
వారాహి పూజ సందర్భంగా కాషాయ కండువా కప్పుకున్న పవన్ కల్యాణ్ ఫోటోను రాంగోపాల్ వర్మ ఎడిట్ చేశాడు. పవన్ కప్పుకున్న కండువాపై శివుడి రూపంలో తాను ఉన్నట్లుగా వర్మ క్రియేట్ చేశాడు. ఎడిట్ చేసిన ఈ ఫోటోని వర్మ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. శివ శివ శివా అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఆర్జీవీ పోస్ట్ వైరల్ అవ్వగా...పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పిచ్చి ముదిరదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
SHIVA …SHIVA … SHIVA pic.twitter.com/ncXz4gfAyl
— Ram Gopal Varma (@RGVzoomin) July 27, 2023
ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ “వ్యూహం” అనే రాజకీయ సినిమా తీస్తున్నారు. ఈ చిత్రాన్ని 2 భాగాల్లో తీయబోతున్నారు. మొదటి భాగానికి వ్యూహం, రెండో భాగానికి శపథం అనే టైటిల్స్ పెట్టారు. వైసీపీకి సపోర్ట్‌గా వ్యూహం సినిమా తీస్తున్నట్టు తెలుస్తోంది.