Vyuham Teaser : RGV వ్యూహం సెకండ్ టీజర్ రిలీజ్

Update: 2023-08-15 07:13 GMT

సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ(Rgv) తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘‘వ్యూహం’’. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, వైఎస్ జగన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ చిత్ర టీజర్ రిలీజ్ కాగా.. తాజాగా టీజర్-2ను ఆర్జీవీ విడుదల చేశారు. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నుంచి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు చోటుచేసుకున్న పరిణామాలను ఆర్జీవీ తన కోణంలో చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్జీవీ విడుదల చేసిన వ్యూహం టీజర్ 2 చూస్తుంటే.. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, సోనియా గాంధీ పోలిన పాత్రలను విలన్స్ మాదిరిగా చూపించడం, వారంతా కుట్రలు చేస్తున్నట్టుగా చిత్రీకరించినట్టుగా కనిపిస్తోంది. అంతేకాకుండా.. జగన్ జైలు జీవితం, ఫ్యామిలీ ఏమోషన్స్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన, కూడా ఈ చిత్రంలో చూపించబోతున్నట్టుగా టీజర్ చూస్తే అర్థం అవుతుంది.

జగన్ కి సంబంధించిన కథతో వ్యూహం అనే సినిమాను రెండు పార్టులుగా తెస్తున్నాడు. మొదటి పార్ట్ ఈ సంవత్సరం, రెండవ పార్ట్ ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేస్తానని ప్రకటించారు ఆర్జీవీ. రాజశేఖర్ రెడ్డి చనిపోయాక జగన్ పై జరిగిన కుట్రలు, జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది వ్యూహం మొదటి పార్ట్ లో చూపించనున్నారు. ఇప్పటికే వ్యూహం నుంచి ఒక టీజర్ విడుదల చేయగా తాజాగా వ్యూహం సినిమా నుంచి మరో టీజర్ ని విడుదల చేశారు ఆర్జీవీ.

ఇక ఈ టీజర్ లో రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత పరిస్థితులు చూపించారు. ఇక ఇందులో జగన్, జగన్ కుటుంబ పాత్రలతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి, అల్లు అరవింద్, సోనియా గాంధీ, రోశయ్య, మన్మోహన్ సింగ్.. ఇలా అనేకమంది పాత్రలని చూపించాడు ఆర్జీవీ. మరి ఈ సినిమా రాజకీయంగా ఏపీలో ఎన్ని ప్రకంపనలు తెస్తుందో చూడాలి.

Full View

Tags:    

Similar News